నవంబర్ 1న దేవుత్తాన ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కుంటున్న విష్ణుమూర్తి.. ఈ రాశులకు గోల్డెన్ డేస్.. డబ్బుతో పాటు ఎన్నో
ఈ సంవత్సరం వచ్చే దేవుత్తాన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు ఒక ప్రత్యేక యోగం కూడా ఏర్పడబోతోంది. రవి యోగం, మహాపురుష రాజయోగం కలయిక ఆ రోజు చోటు చేసుకోబోతోంది. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. మరి దేవుత్తాన ఏకాదశి ఎవరికి కలిసి వస్తుంది?
ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి నవంబర్ 1న వచ్చింది. ఆ రోజు విష్ణువు, లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే దేవుత్తాన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు ఒక ప్రత్యేక యోగం కూడా ఏర్పడబోతోంది. రవి యోగం, మహాపురుష రాజయోగం కలయిక ఆ రోజు చోటు చేసుకోబోతోంది. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు.

సుమారు 142 రోజుల తర్వాత ఆ విష్ణుమూర్తి మేలుకొంటారు. అయితే ఆ రోజున కొన్ని రాశుల వారు విశేష ఫలితాలను చూస్తారు. మరి దేవుత్తాన ఏకాదశి ఎవరికి కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడే తెలుసుకుందాం.
యోగ నిద్ర నుంచి మేల్కొంటున్న విష్ణుమూర్తి.. ఈ రాశుల వారికి శుభ సమయం
1.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి విష్ణువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఏకాదశి నాడు ఈ రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం.
2.మేష రాశి
మేష రాశి వారికి ఈ ఏకాదశి నాడు విష్ణు అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. సంపద కలుగుతుంది, జీవితం ఆనందంగా మారుతుంది, కోరికలు కూడా తీరుతాయి.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఏకాదశి నాడు అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్‌లో పురోగతి ఉంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
4.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఏకాదశి నాడు బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కలగవచ్చు. ఆనందం పెరుగుతుంది, మానసిక సమతుల్యత కూడా ఉంటుంది. వ్యాపారులకూ ఇది మంచి సమయం. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా ఇది కలిసి వస్తుంది. విజయాలను అందుకుంటారు.
5.కన్యా రాశి
కన్యా రాశి వారికి ఏకాదశి బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో పురోగతి చూస్తారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. మానసిక శాంతిని పొందుతారు. తోబుట్టువులతో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటారు.
6.మకర రాశి
మకర రాశి వారికి ఈ ఏకాదశి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలను పొందుతారు. కార్యాలయంలో ప్రాజెక్టులతో విజయాన్ని సాధిస్తారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


