రక్షాబంధన్ నాడు చంద్రుడి అనుగ్రహంతో ఈ రెండు రాశులకు మంచి రోజులు మొదలు.. డబ్బు, సంతోషంతో పాటు ఎన్నో!
రక్షాబంధన్ నాడు చంద్రుడు సంచారంలో కూడా మార్పు ఉంటుంది. రక్షాబంధన్ రోజున శ్రవణ నక్షత్రంలోకి చంద్రుడు అడుగుపెడతాడు. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు?
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అదే విధంగా గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి కూడా మారుతూ ఉంటాయి. ఈసారి ఆగస్టు 9న రక్షాబంధన్వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ను జరుపుకుంటాము. అక్క చెల్లెలు, అన్నదమ్ములకు రాఖీ కట్టి ఎంతో ప్రేమగా రక్షాబంధన్‌ను జరుపుకుంటారు.
తన సోదరుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా సోదరుడు తన సోదరిని రక్షిస్తానని మాట ఇస్తాడు. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ రక్షాబంధన్ చాలా శుభప్రదమైన రోజు.
గ్రహాలసంచారం కూడా అనుకూలంగా ఉంది. రక్షాబంధన్ నాడు చంద్రుడు సంచారంలో కూడా మార్పు ఉంటుంది. రక్షాబంధన్ రోజున శ్రవణ నక్షత్రంలోకి చంద్రుడు అడుగుపెడతాడు. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
శ్రవణ నక్షత్రంలోకి చంద్రుడు
చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు? వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
చంద్రుడి నక్షత్ర సంచారంలో మార్పు.. మూడు రాశులకు అనేక లాభాలు
1.మేష రాశి:
మేష రాశి వారికి రక్షాబంధన్ కలిసి వస్తుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో ఈ రాశి వారు అనేక లాభాలను పొందుతారు. ఈ సమయంలో జీతం పెరుగుతుంది. పాత సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. అలాగే మేష రాశి వారు మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. కెరీర్‌లో కూడా పురోగతి ఉంటుంది.
2.కుంభ రాశి:
కుంభ రాశివారికి రక్షాబంధన్ కలిసి వస్తుంది. చంద్రుడి నక్షత్ర మార్పుతో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. కుంభ రాశి వారు కొత్త పనిని మొదలు పెట్టడానికి కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
అదే విధంగా కుంభ రాశి వారు వారి కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారి ఇంట సంతోషం కూడా ఉంటుంది. ఇలా, ఈ రెండు రాశుల వారు రక్షాబంధన్ నాడు చంద్రుడి నక్షత్ర సంచారంతో లాభాలను పొందుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



