...
...
Next Story

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు.. ఇతరులను కూడా ఈజీగా ఆకట్టుకుంటారు!

సంఖ్యల వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. వీటి ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, భవిష్యత్తు గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైనవారు. పైగా ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు.

Published on: Jul 5, 2025, 12:00:10 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. కొన్ని తేదీల్లోపుట్టిన వారు తెలివైన వారు, వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. పైగా, వారి వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది.

సంఖ్యలు, రహస్యాలు

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు (pinterest)
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు తెలివైన వారు (pinterest)

సంఖ్యల వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. వీటి ద్వారా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి, భవిష్యత్తు గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టినవారు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. సులువుగా ఆకట్టుకోవడం, తెలివితేటలు కలిగి ఉండడం వంటివి ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్పెషల్ అని చెప్పవచ్చు.

రాడిక్స్ నెంబర్ 7

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్నెంబర్ 7 అవుతుంది. కేతువు ఈ సంఖ్యను పరిపాలిస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. బయట చూడడానికి చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉంటారు. ఆలోచనలు ఉంటాయి, ఓపెన్‌గా వీరి భావాలను బయటపెడతారు. పైకి వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడూ కూడా అందరి నుంచి దూరంగా ఉంటారు.

ఈజీగా ఆకట్టుకుంటారు

వీరి ఆలోచనలను కానీ, వీరు ప్రవర్తించే తీరు కానీ ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పైగా, ఇతరుల కంటే మీరుకొంచెం స్పెషల్‌గా కనిపిస్తారు. ఇతరులను ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. క్రియేటివిటీ కూడా ఎక్కువే. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువ క్రియేటివిటీని కలిగి ఉంటారు. మ్యూజిక్, రైటింగ్, పెయింటింగ్, నటన వంటి క్రియేటివ్ ఫీల్డ్స్‌లో సెటిల్ అవుతారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe