ఈ తేదీల్లో పుట్టిన వారు మన పక్కనుంటే ఎంత బాగుంటుందో.. వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సక్సెస్ కి మారుపేరు కూడా!

ఒక మనిషి పుట్టిన తేదీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఆ పుట్టిన తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. వారి స్వభావానికి సంబంధించిన రహస్యాలను, భవిష్యత్తుకు సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు రాడిక్స్ నంబర్ 5కి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

Published on: Jul 19, 2025, 07:00:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడమే కాకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. అయితే, ఒక మనిషి పుట్టిన తేదీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు. ఆ పుట్టినతేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. వారి స్వభావానికి సంబంధించిన రహస్యాలను, భవిష్యత్తుకు సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకోవచ్చు.

ఈ తేదీల్లో పుట్టిన వారు మన పక్కనుంటే ఎంత బాగుంటుందో (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు మన పక్కనుంటే ఎంత బాగుంటుందో (pinterest)

వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ప్రవర్తన ఎలా ఉంటుంది, వారిపై ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. కెరియర్‌లో, రిలేషన్‌షిప్‌లో, కుటుంబ జీవితంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా న్యూమరాలజీ చెప్తుంది. ఈరోజు రాడిక్స్ నంబర్ 5కి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

రాడిక్స్ నంబర్ 5:

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లోపుట్టినట్లయితే వారి రాడిక్స్ నంబర్ 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. బుధుడు తెలివితేటలు, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. రాడిక్స్ నంబర్ 5 కలిగిన వారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు, అన్నిట్లో ముందుంటారు. ఆర్ట్, కమ్యూనికేషన్ వంటి వాటిలో షార్ప్‌గా ఉంటారు.

కష్టపడతారు, యాక్టివ్‌గా ఉంటారు.

ఏ పని అయినా సరే ఇంకా మంచిగా చేయాలని అనిపిస్తుంది. ఎల్లప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రతి అడుగును సరిగ్గా వేస్తారు. సులువుగాసక్సెస్ సాధిస్తారు.

ఆర్గనైజ్డ్ గా ఉంటారు

ప్రతి దానిని సక్రమంగా పూర్తి చేస్తారు. ఆర్గనైజ్డ్‌గా ఉంటారు, కరెక్ట్‌గా ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబాన్ని, పనిని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకుంటారు. వారికి కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ, గౌరవం లభిస్తాయి. బాగా మాట్లాడతారు, ఇతరులు వారి మాటలను విని ఇంప్రెస్ అవుతారు. ఎవరికైనా ఏదైనా చెప్తే, వారు సులువుగా వీరిని ఇన్‌స్పైర్ అవుతారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు. అవకాశం వస్తే చాలు, ఆ పనిలో దూసుకుపోతారు. ఓటమి లేకుండా విజయాలను చేరుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More