ఈ తేదీల్లో పుట్టిన వారికి శనీశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. ఏ బాధా లేకుండా సంతోషంగా ఉండచ్చు!

న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరికి శని దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు, ఎలాంటి సమస్యలు వచ్చినా తొలగిస్తాడు. ఈ తేదీల్లో పుట్టిన వారు సంతోషంగా జీవిస్తారు. ఏ ఇబ్బందులు వచ్చినా సరే, శని ఆశీర్వాదంతో తొలగిపోతాయి. మరి వీరిలో మీరు ఒకరేమో తెలుసుకోండి.

Published on: Jun 30, 2025 9:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యాయాధిపతి శని దేవుడు వారి కర్మల ప్రకారం ఫలితాలని ఇస్తాడు. జ్యోతిషశాస్త్రం, సంఖ్య శాస్త్రం గురించి అందరికీ తెలుసు. న్యూమరాలజీ జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన వారికి శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరికి శని దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు, ఎలాంటి సమస్యలు వచ్చినా తొలగిస్తాడు. ఈ తేదీల్లో పుట్టిన వారు సంతోషంగా జీవిస్తారు. ఏ ఇబ్బందులు వచ్చినా సరే, శని ఆశీర్వాదంతో తొలగిపోతాయి. మరి వీరిలో మీరు ఒకరేమో తెలుసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన వారికి శనీశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది
ఈ తేదీల్లో పుట్టిన వారికి శనీశ్వరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది

రాడిక్స్ నెంబర్ 8

శనీశ్వరుడు, 8 సంఖ్యకు అధిపతి. జనని తేదీని బట్టి రాడిక్స్నెంబర్ ని తెలుసుకోవచ్చు. ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ నెంబర్ 8 అవుతుంది. వీరికి శని దేవుడు ప్రత్యేక ఆశీస్సులు ఇస్తాడు.

రాడిక్స్ నెంబర్ 8 వారు ఎలా ఉంటారు?

న్యాయాధిపతి శనీశ్వరుడు ఎనిమిదవ సంఖ్యకి అధిపతి. ఈ సంఖ్య ఉన్నవారు చురుకుగా ఉంటారు. ఏ పనినైనా సరే, తొందరగా పూర్తి చేస్తారు. ప్రతి పనిని కూడా వారి రీతిలో చేసేస్తారు. అందరికంటే భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. శని మద్దతు ఎప్పుడూ ఈ తేదీల్లోపుట్టిన వారికి ఉంటుంది.

శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ పరిహారాలని పాటించండి

  1. పైన చెప్పిన తేదీల్లో పుట్టిన వారికి శని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ సంఖ్య వారు శనివారం నాడు శని ఆలయానికి వెళ్లి శని దేవుడికి ఆవ నూనెతో దీపారాధన చేయడం మంచిది.
  2. శనివారంనాడు నల్ల నువ్వుల్ని దానం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
  3. పేదలకు ఏదైనా దానం చేస్తే కూడా శుభ ఫలితాలని పొందవచ్చు.
  4. నల్ల కుక్కలకు రొట్టెలు తినిపిస్తే కూడా శని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.
  5. ఇలా చేయడంతో పాటుగా, మీరు పని చేసేటప్పుడు పూర్తి ధ్యాస పెట్టి, శ్రద్ధగా చేయండి. మీ పనులు చక్కగా జరుగుతాయి. ఏలినాటిశని ఉన్నవారు కూడా మా శని పరిహారాలని పాటించడం మంచిది. శుభ ఫలితాలను పొందవచ్చు, సంతోషంగా ఉండొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More