ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తలకు అదృష్టం, వారి ఇంట్లో ఎప్పుడూ కాసుల వర్షం కురుస్తుంది.. దేనికీ లోటు ఉండదు!
న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంది అనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉందో కూడా చెప్పవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తలకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తారు. వారి భర్తలు జీవితంలో సంతోషంగా ఉంటారు.
న్యూమరాలజీ ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంది అనేది చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉందో కూడా చెప్పవచ్చు. ఒక్కో సంఖ్య వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే, కొన్ని సంఖ్యలు వారు భర్తలకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. పుట్టినతేదీ ఆధారంగా రాడిక్స్ నంబర్ ని తెలుసుకోవచ్చు.

రాడిక్స్ నెంబర్ 3
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ నంబర్ 3కి చెందినవారు. ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తలకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తారు. వారి భర్తలు జీవితంలో సంతోషంగా ఉంటారు, సక్సెస్ ను అందుకుంటారు. వారి జీవితంలోసానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది.
అదృష్టవంతులు, లక్ష్మీదేవి
ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తకు విపరీతమైన అదృష్టాన్ని తీసుకు వస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంతోషం, ధనం, ప్రశాంతత ఉంటాయి. వీరిని లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.
సానుకూల శక్తి:
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. వారి చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగాఉంటుంది. వారి భర్తకు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, వారి వెనుక నిలబడతారు. వారిని ఇన్‌స్పైర్ చేసి, ముందుకు నడిచేలా చేస్తారు.
తెలివితేటలు:
రాడిక్స్ నంబర్ 3 వారు చాలా తెలివైన వారు. ప్రాక్టికల్ గా నిర్ణయాలు తీసుకుంటారు. వారి భర్తలకు ఇచ్చే సలహాలు, వారి భర్త కెరీర్ కి, బిజినెస్ కి ఎంతో సహాయం చేస్తాయి. డబ్బులను సరిగ్గా వినియోగిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు డబ్బులను తెలివిగా సేవింగ్స్ చేస్తారు, బాగా సంపాదన కలిగి సంతోషంగాఉండేలా చూస్తారు.
ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
పైన చెప్పిన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ విధేయతతో, ప్రేమతో సంబంధాలను కొనసాగిస్తారు. భర్తకుమానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. ఇది జీవితంలోని ప్రతి మలుపులో విజయపథాన్ని సులభం చేస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper













