...
...
Next Story

ఇలాంటి గుణాలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు.. అసంతృప్తితో జీవిస్తారు!

మహాభారతంలో ఉన్న ముఖ్యమైన పాత్రల్లో విదురుడు ఒకరు. విదురుడికి ఉన్న జ్ఞానం, తెలివితేటలు, కృష్ణ భక్తి కారణంగా ఇప్పటికీ ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటున్నారు. విదురుడు చెప్పిన విషయాలను మనం పాటించినట్లయితే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Published on: Jun 4, 2025, 07:00:11 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మన జీవితంలో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా ప్రతికూల ఆలోచనలు వదిలిపెట్టాలి. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలి. అప్పుడు జీవితంబాగుంటుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాలంటే గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవచ్చు. అలాగే వారి ఆలోచనల నుంచి కూడా మనం ప్రేరణ పొందవచ్చు.

ఇలాంటి గుణాలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు (pinterest)
ఇలాంటి గుణాలు ఉన్నవారు సంతోషంగా ఉండలేరు (pinterest)

మహాభారతంలో ఉన్న ముఖ్యమైన పాత్రల్లో విదురుడుఒకరు. విదురుడికి ఉన్న జ్ఞానం, తెలివితేటలు, కృష్ణ భక్తి కారణంగా ఇప్పటికీ ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటున్నారు. విదురుడు చెప్పిన విషయాలను మనం పాటించినట్లయితే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అసంతృప్తిగా ఉండే వ్యక్తుల గురించి విదురుడు చెప్పారు. వీళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, సరిగ్గా కాదు, ఇతరులను కూడా బాధ పెడతారని అన్నారు.

ఎలాంటి గుణాలు ఉన్నవారు సంతృప్తిగా, సంతోషంగా ఉండరు?

1.ద్వేషం:

ఎవరికైతే ద్వేషం, అసూయ ఎక్కువగా ఉంటాయో వారు సంతోషంగా ఉండరు. ఇతరులను సంతోషంగాఉండనివ్వరూ. వారు చివరకు ప్రతికూలతను, ఒంటరితనాన్ని ఎంచుకుంటారని విదురుడు చెప్పారు. తన కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి కూడా దూరమవుతారు.

2.అసూయ:

ఎవరికైతే అసూయ ఉంటుందో వారు జీవితంలో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా ఎంతో తక్కువగా ఉంటుంది. అసూయ ఉండే వ్యక్తి ఇతరుల్లో కూడా ప్రతికూలఆలోచనలను పెంచుతాడు.

3.కోపం:

కోపం ఎక్కువగా ఉన్నవారు ఎప్పుడు దుఃఖంతో ఉంటారని విదురుడు చెప్పారు. ఎక్కువ కోపం ఉంటే అది జీవితంలోని సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. రిలేషన్స్‌ని కూడా బాగా దెబ్బతీస్తుందని విదురనీతిలో చెప్పారు.

4.ఇతరులపై ఆధారపడడం:

ఎప్పుడూ కూడా ఇతరులపై ఆధారపడకూడదు. కష్టపడి సక్సెస్‌ను అందుకోవచ్చు. ఇతరులపై ఆధారపడే వారు గౌరవాన్ని కూడా పొందలేరు, సంతోషంగా ఉండలేరు.

5.సంతృప్తి లేకపోవడం:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe