...
...
Next Story

ఈరోజే శక్తివంతమైన నవ పంచమ రాజయోగం, ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు.. అదృష్టం, ధన లాభం, వివాహం ఇలా ఎన్నో!

జూలై 7న శుక్రుడు, యముడు శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శని రాశి అయినటువంటి మకర రాశిలో యముడు సంచారం చేస్తున్నాడు. శుక్రుడు, యముడు ఒకదానికొకటి 120 డిగ్రీలలో ఉంటారు. దీంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది, అదృష్టాన్ని కలిగిస్తుంది.

Published on: Jul 7, 2025, 09:00:04 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై 7న శుభదినంగా ఉండనుంది. ఎందుకంటే, ఈరోజు శుక్రుడు, యముడు ఒకదానికొకటి 120 డిగ్రీల వద్ద ఉంటారు. ఇది శక్తివంతమైన నవ పంచమ రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ నవ పంచమ రాజయోగం మూడు రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

శక్తివంతమైన నవ పంచమ రాజయోగం

శక్తివంతమైన నవ పంచమ రాజయోగం (Canva)
శక్తివంతమైన నవ పంచమ రాజయోగం (Canva)

జూలై 7న శుక్రుడు, యముడు శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శని రాశి అయినటువంటి మకర రాశిలో యముడు సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ రాశిలో జూలై 26 వరకు ఉంటుంది. జూలై 7న ఉదయం 6:30కు శుక్రుడు, యముడు ఒకదానికొకటి 120 డిగ్రీలలో ఉంటారు. దీంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది, అదృష్టాన్ని కలిగిస్తుంది.

నవ పంచమ రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు

1.మేష రాశి:

మేష రాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. మేష రాశి వారు ఈ సమయంలో భౌతిక సంతోషాన్ని పెంచుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది. వ్యాపారం మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు కంటే బాగుంటుంది. వైద్య రంగంలో పనిచేసే వారు ధన లాభాలను పొందుతారు.

2.వృశ్చిక రాశి:

వృశ్చికరాశి వారికి కూడా నవ పంచమ రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికపరంగా సమస్యలు తొలగిపోతాయి. శుక్రుడు, యముడు సృష్టించిన ఈ యోగం వలన పెళ్లి విషయంలో సానుకూల మార్పులు చూడొచ్చు. వైవాహిక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారంలో కూడా బోలెడు లాభాలు ఉంటాయి.

3.మకర రాశి:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks