శక్తివంతమైన త్రియేకాదశి యోగం.. బుధ, యముడి అనుగ్రహంతో ఈ రాశులు వారి కష్టాలకు చెక్.. అదృష్టం, డబ్బుతో పాటు ఎన్నో!
బుధుడు, యముడు తెలివితేటలు మొదలైన వాటికి కారకులు. ఈ రెండు 60 డిగ్రీల దూరంలో ఒకరికొకరు ఉన్నప్పుడు త్రియేకాదశ యోగం ఏర్పడుతుంది. నవంబర్ 23 వరకు బుధుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, యముడు మకర రాశిలో ఉంటాడు. దీంతో ఈ రెండు గ్రహాల కారణంగా త్రియేకాదశి యోగం ఏర్పడనుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. బుధుడు, యముడు తెలివితేటలు మొదలైన వాటికి కారకులు. ఈ రెండు 60 డిగ్రీల దూరంలో ఒకరికొకరు ఉన్నప్పుడు త్రియేకాదశ యోగం ఏర్పడుతుంది. నవంబర్ 23 వరకు బుధుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, యముడు మకర రాశిలో ఉంటాడు. దీంతో ఈ రెండు గ్రహాల కారణంగా త్రియేకాదశి యోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతుంది.

త్రియేకాదశి యోగం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం కొన్ని రాశులవరకు ఎక్కువ లాభాలను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు, ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి అనేక లాభాలనే తీసుకురాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు, ఊహించని లాభాలను పొందుతారు.
ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక లాభాలను పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
త్రియేకాదశి యోగంతో ఈ రాశులు వారికి అనేక లాభాలు:
1.మేష రాశి:
మేష రాశి వారికి బుధ, యమ సంయోగంతో ఏర్పడే యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా కలిసి వస్తుంది. తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ ఉంటుంది. విజయాలను అందుకుంటారు. జీవితంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవమర్యాదలు కూడా పెరుగుతాయి.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి త్రియేకాదశ యోగం బాగా కలిసి వస్తుంది. బుధ, యమ ఏర్పరిచే యోగం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో సక్సెస్‌ని అందుకుంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విదేశాల్లో పని చేయాలనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం. మీడియా, ఆర్ట్ రిలేటెడ్ పనులు చేసే వారికి ఈ సమయం బాగుంటుంది. కొత్త వ్యాపారాలను స్టార్ట్ చేయడానికి కూడా ఇది మంచి సమయం.
3.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి త్రియేకాదశ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. వ్యాపారాలు చేసే వారికి కూడా బాగుంటుంది. పాత స్నేహితుల నుంచి సహాయాన్ని పొందుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో కూడా ఆనందం పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


