...
...
Next Story

శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలతో కొలువైన పూరీ జగన్నాథ్ క్షేత్రం మహిమ, వైభవం తెలుసుకోండి!

సాధారణంగా ఏ ఆలయంలోనైనా, ఏ దేవుడైనా ఒక్కరుగానో లేదా తన దేవేరితోనో కొలువుదీరి దర్శనమిస్తారు. అయితే, అందుకు భిన్నంగా పురీక్షేత్రం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు, శ్రీ జగన్నాథ స్వామి పేరుతో, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలతో కొలువుదీరిన దివ్యక్షేత్రం.

Published on: Jul 9, 2025, 07:00:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడి దేవేరులు, రుక్మిణి, సత్యభామ మొదలైనవారు రాధారాణి వద్దకు వచ్చి, బృందావనంలో బాలకృష్ణుడి లీలలను వివరించమని కోరారు. రాధారాణి వారికి వివరిస్తూ ఉన్న సమయంలో, అటుగా వెళ్తున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలు తలుపువద్ద నిలబడి వినసాగారు. ఈ సమయంలో అక్కడకు చేరిన నారదమహర్షి, "మీరు అలాగే ఉండండి," అని కోరాడు. నారదుడి కోరిక మేరకు వారు ఈ క్షేత్రంలో కొలువుదీరినట్లు చెబుతారు. అంతేకాకుండా, ఇక్కడ దేవతామూర్తులను సృష్టికర్త బ్రహ్మ దేవుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలువెల్లడిస్తున్నాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఆలయం, విగ్రహాలు

పూర్వం ఈ ప్రాంతానికి 'ఉత్కళ' రాజ్యం అని పేరు. ఈ రాజ్య పాలకుడు ఇంద్రద్యుమ్నుడు. దైవభక్తిపరాయణుడు అయిన ఇంద్రద్యుమ్నుడికి ఒక కోరిక ఉండేది. ఒక ఆలయాన్ని నిర్మించి, అందులో గంధపు చెక్కతో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించాలనేది కోరిక అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తిప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. వాడుకలో పూరీక్షేత్రంగా పిలిచే పురీక్షేత్రంలోని ఆలయం ఎన్నో విశేషాలను స్వంతం చేసుకున్నది.

దివ్య క్షేత్రం

సాధారణంగా ఏ ఆలయంలోనైనా, ఏ దేవుడైనా ఒక్కరుగానో లేదా తన దేవేరితోనో కొలువుదీరి దర్శనమిస్తారు. అయితే, అందుకు భిన్నంగా పురీక్షేత్రం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు, శ్రీ జగన్నాథస్వామి పేరుతో, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రలతో కొలువుదీరిన దివ్యక్షేత్రం. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో ఒకటైన పూర్వా మాయగోవర్ధన పీఠం ఉన్న పుణ్యస్థలం. ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన నాలుగు ధామాలలో ఒకటైన పుణ్యధామం.

నాలుగు వైపులా ద్వారాలు

ఆలయంలో ప్రవేశించేందుకు నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయి. ప్రధాన తూర్పుద్వారానికి 'సింహద్వారం' అని పేరు. పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ద్వారాలకు వ్యాఘ్రద్వారం, హథీద్వారం, అశ్వద్వారం అని పేర్లు. ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి, ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు 24 మెట్లతో ఉన్న సోపానమార్గం ఉంది. ఈ సోపానమార్గానికి 'బాయిసిపవచ' అని పేరు. గర్భాలయంలో శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రలు విచిత్రమైన రూపురేఖా విన్యాసాలతో దర్శనమిస్తారు. ఒక స్తంభానికి తల అతికించినట్లుగా వీరి విగ్రహాలు ఉంటాయి.

గర్భాలయం పై ఉన్న గోపురం 'శంఖాకారం' లో ఉంటుంది. గోపురంపై సుదర్శన చక్రం ప్రతిష్ఠింపబడింది. ఈ సుదర్శన చక్రం ఆలయానికి కొద్దిదూరం నుండి ఎటువైపు నుండి చూసినా మన వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. గోపురంపై ప్రతిరోజూ సాయంత్రం నూతన పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ పతాకం గాలి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉండటం విశేషం.

ప్రతిష్ఠించేందుకు దేవతామూర్తులను తయారు చేసే శిల్పులను అన్వేషిస్తూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకనాటి రాత్రి ఇంద్రద్యుమ్నుడికి శ్రీ జగన్నాథస్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, "సముద్రతీరంలో ఒక పెద్ద కొయ్య ఉంది. ఆ కొయ్యను తీసుకుని వచ్చి, దానితో నాతో పాటు నా సోదరి, సోదరుల విగ్రహాలను చేయించి, వాటికి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించు," అని పలికాడు.

మరుసటిరోజే సేవకులతో కలిసి సముద్రతీరానికి చేరుకుని వెతికారు. స్వామి వారు కలలో చెప్పినట్లు కొయ్య కనిపించింది. దానిని తీసుకువచ్చి, దానితో విగ్రహాలు తయారు చేయాలని శిల్పుల కోసం అనేక ప్రాంతాలలో అన్వేషింపజేశాడు. అయితే సరైన శిల్పులు లభించక నిరాశతో ఉండేవాడు. ఇలాంటి స్థితిలో ఒకనాడు ఆ రాజుకు శ్రీ మహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చి,"నీ కొలువుకు ఇద్దరు శిల్పులు వస్తారు. వారిని నియమించు. వారు విగ్రహాలను తయారు చేస్తారు," అని పలికాడు.

120 ఆలయాలు

పూరీఆలయంపై పక్షులు ఎగరవు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో 120 ఆలయాలు ఉన్నాయి. జగన్నాథ స్వామివారికి రోజూ 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని ఆలయంలో ఉన్న వంటశాలలో సంప్రదాయంగా వండుతారు. కట్టెల పొయ్యి పై ఒకదానిపై ఒకటిగా ఏడు కుండలను ఉంచి వండుతారు. ముందుగా అన్నింటికంటే పై కుండలోని పదార్థం తయారు కావడం విశేషం.

స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆనంద బజారులో భక్తులకు అందజేస్తారు. వివిధ రకాల కూరలు, అన్నం, పాయసం వంటివిగా ఈ ప్రసాదాలు ఉండడం విశేషం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఎన్నోవిశేషాలను, ప్రత్యేకతలకు నిలయమైన జగన్నాథ రథోత్సవం సందర్భంగా, పురీక్షేత్రాన్ని, స్వామి వారిని స్మరించడం, దర్శించడం అత్యంత పుణ్యప్రదం. మరునాడు ఇంద్రద్యుమ్నుడు రాజదర్బారులో కొలువుదీరి ఉండగా, పనిముట్లు చేత పట్టుకుని ఇద్దరు శిల్పులు వచ్చి, కొయ్యతో విగ్రహాలను తయారు చేస్తామని పలికారు. రాజు కొయ్యను చూపించి, "శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలను తయారు చేయండి," అని కోరాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అందుకు, మహారాజా! మేము శిల్పాలను ఇరవై ఒక్క రోజుల్లో పూర్తిచేస్తాము. ఆలయం లోపల ఉండి, తలుపులు మూసుకుని విగ్రహాలను తయారు చేస్తాము. మేము పని చేసుకుని బయటకు వచ్చేవరకు మా పనికి అంతరాయం కలిగించవద్దు," అని శిల్పులు షరతు విధించారు. అందుకు రాజు అంగీకరించడంతో, శిల్పులు ఆలయం లోకి వెళ్లి, తలుపులు మూసుకుని పనిని ప్రారంభించారు. అలా పదిహేను రోజులు గడిచిపోయాయి. పదిహేనవనాడు, ఆలయం వద్దకు వచ్చిన రాణికి ఎటువంటి శబ్ధాలు లోపలి నుండి వినిపించకపోవడంతో సందేహం కలిగింది. ఈ విషయాన్ని రాణి రాజుకు తెలుపగా, రాజు కూడా ఆలయం వద్దకు వచ్చి పరిశీలించాడు. ఎటువంటి శబ్ధమూ వినిపించకపోవడంతో అనుమానం అధికమైన రాజు, ఆలయం తలుపులు తెరిపించాడు.

రాజు ఆలయంలోకి ప్రవేశించగానే, పనిచేస్తున్న శిల్పులు హఠాత్తుగా అదృశ్యమయ్యారు. ప్రక్కనే అసంపూర్ణంగా చెక్కబడిన విగ్రహాలు కనిపించాయి. విగ్రహాలు పూర్తికాలేదని చింతిస్తూ రాజు చేసేదేమీ లేక, తాను నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించి, పూజాకార్యక్రమాలను ప్రారంభించాడు. ఆ విగ్రహాలే శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రలవి. ఈ విధంగా, శ్రీ జగన్నాథస్వామి, పురీక్షేత్రంలో వెలసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోందని, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అధిక ఆషాఢంలో నూతన మూలమూర్తుల ప్రతిష్ఠ

సాధారణంగా ఆలయంలో ఒకసారి దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తే, ఇక కదిలించరు. ఒకవేళ మూర్తుల్లో ఏవైనా లోపాలు తలెత్తితే తప్ప మార్చరు. అయితే, పురీక్షేత్రంలో సాధారణంగా పన్నెండు నుంచి పందొమ్మిది సంవత్సరాలకు ఒకసారి, అధిక ఆషాఢమాసం వచ్చిన సమయంలో పాత విగ్రహాల స్థానంలో నూతన మూర్తులను ప్రతిష్ఠిస్తారు.

అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరం, పురీలోని వృద్ధ పండితుడు, కాకటూర్ అనే గ్రామానికి చేరుకుంటాడు. ఆ గ్రామంలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో, స్వప్నంలో ఆ గ్రామదేవత, స్వామివారి మూర్తుల తయారీకి పనికివచ్చే వృక్షాలు ఎక్కడ లభిస్తాయో చెబుతుంది. ఆ చెట్లు వేప చెట్లు.

వివిధ స్థలాల్లో ఉండే ఆ వృక్షాలపై సహజసిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, పద్మం గుర్తులు ఉండటం విశేషం. ఆ వృక్షాల దగ్గరకు చేరుకొని, ముందుగా పూజలు చేసి వాటిని కొట్టి, ఆ చెట్ల కొయ్యలను బండ్లపై ఉంచి, ఆ బండ్లను మనుషులే లాగుతూ పురీకి తీసుకువస్తారు. ఆలయం వెనుక వైపున ఉన్న తోటలో వాటిని ఉంచి, విగ్రహాలను తయారు చేసి రంగులుఅద్దుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తర్వాత పాతమూర్తులలోని జీవశక్తిని నూతనమూర్తుల్లో నింపి ప్రతిష్ఠిస్తారు. పాత విగ్రహాలను తోటలోని ఒక నిర్దేశిత ప్రాంతంలో సింహాసనం పై ఉంచి పూడ్చిపెడతారు. మళ్ళీ అధిక ఆషాఢ మాసం సమయంలో త్రవ్వే సమయంలో భూమిలో సింహాసనం మాత్రమే ఉంటుంది కానీ పాత విగ్రహాలు కనిపించవు. ఇది ఈ క్షేత్రంలో మాత్రమే జరిగే గొప్ప అద్భుతం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe