...
...
Next Story

నేటి రాశి ఫలాలు జూలై 18, 2025: ఈరోజు ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది, సూర్యారాధన మేలు చేస్తుంది!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 18.07.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 18, 2025, 04:00:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

హిందుస్తాన్ టైమ్స్

నేటి రాశి ఫలాలు (freepik)
నేటి రాశి ఫలాలు (freepik)

రాశిఫలాలు (దిన ఫలాలు) : 18.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : శుక్రవారం, తిథి : కృ. అష్టమి, నక్షత్రం : అశ్విని

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది, కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. భూ లావాదేవీల్లో లబ్ధి పొందుతారు. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృషభ రాశి

గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. కొత్త ఒప్పందాలకు అనువైన సమయం. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు తగదు. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి. సూర్యారాధన శుభప్రదం.

మిథున రాశి

మిథునరాశి వారికి ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాల్లో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారులు కొత్త ఒప్పందాల విషయంలో వేచిచూసే ధోరణితో ఉండటం మంచిది. వారాంతంలో శుభవార్త వింటారు. పరిస్థితుల్లో అనుకూల మార్పులు మొదలవుతాయి. రాబడి పెరుగుతుంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.

కర్కాటక రాశి

మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో మనస్పర్థలు రావొచ్చు. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల అండదండలు పొందుతారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

సింహ రాశి

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో వృథా ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆశ్రద్ధ కారణంగా కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అదృష్టంతో వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

తుల రాశి

గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆలోచనలు అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది. పెద్దల సహకారంతో పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం, దానికి తగ్గ ఫలితం పొందుతారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. రుణ ప్రయత్నాలు చేయాల్సి రావొచ్చు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి రావలసిన డబ్బు అందుతుంది. రోజువారీ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం అవసరం. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మంచి మార్పు వస్తుంది. గణపతి గుడికి వెళ్లండి.

ధనుస్సు రాశి

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములు, స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. అయితే రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. సమయపాలన అవసరం. శివారాధన శుభప్రదం.

మకర రాశి

మకరరాశి వారికి మంచి ఆలోచనలు అమలు చేస్తారు. అన్ని పనుల్లో తాత్కాలిక లబ్ధి పొందుతారు. వ్యాపారులు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. వారం మధ్యలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు ప్రథమార్థం ప్రతికూలంగా ఉంది. ఏదీ కలిసిరాదు. సహోద్యోగులతో సఖ్యత కొరవడుతుంది. శ్రేయోభిలాషులను దూరం చేసుకుంటారు. ఆత్మీయుల సహకారం ఆశిస్తారు, కానీ వారికి అవకాశం ఉన్నా సాయం చేయడానికి మనసురాదు. వారాంతంలో పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. గతంలో చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం వస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మీన రాశి

మీన రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువు, ఉన్నత విద్య, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేరిస్తాయి. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe