జులైలో శని, కుజుడి సంచారంలో మార్పు.. ఈ 3 రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.. ప్రాపర్టీలు, వాహనాలతో పాటు ఎన్నో!
ప్రస్తుతం కుజుడు సింహ రాశిలో ఉన్నాడు. జూలై నెలలో కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంచార మార్పు వలన 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా బాగా ఉంటుంది. ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది, డబ్బు వస్తుంది.
జూలై నెలలో శని సంచారంలో మార్పు ఉంటుంది. జూలై 13 నుంచి శని తిరోగమనంలో ఉంటాడు. ఆ తర్వాత కుజుడు కూడా జూలై నెలలో రాశి మార్పు చెందుతాడు. ఈ రెండు గ్రహాలమార్పు వలన కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. న్యాయానికి అధిపతి అయిన శని, మీన రాశిలో తిరోగమనం చెందుతాడు. మీన రాశిలో శని తిరోగమనం మూడు నెలల వరకు కొనసాగుతుంది. జూలై నెలలో కుజుని సంచారం కూడా ఉంటుంది.

ప్రస్తుతం కుజుడుసింహ రాశిలో ఉన్నాడు. జూలై నెలలో కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల సంచార మార్పు వలన 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.
కానీ మూడు రాశుల వారికి మాత్రం ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయి. శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికి ఆర్థికపరంగా బాగా ఉంటుంది. ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది, డబ్బు వస్తుంది. మరి ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూద్దాం.
జూలై నెలలో ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు
1.ధనుస్సు రాశి
ధనుస్సురాశి వారికి జూలై నెలలో శని, కుజుడి సంచార మార్పు ఊహించని మార్పులు తీసుకువస్తుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారు పని ప్రదేశంలో అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా బాగా ఉంటుంది.
2.మీన రాశి
మీనరాశి వారికి శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు కలసి వస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. భార్యాభర్తల మధ్య సంబంధం బాగా ఉంటుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది
3.మకర రాశి
మకరరాశి వారికి జూలై నెలలో బాగా ఉంటుంది. శని తిరోగమనం, కుజుడి రాశి మార్పు వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రాపర్టీని కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



