శని కదలికతో, ఈ 3 రాశుల వారికి గోల్డెన్ డేస్.. సంపద, విజయాలు, శుభవార్తలతో పాటు ఎన్నో!

జూలై నెలలో శని ప్రత్యక్షంగా ఉంటుంది. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఉంటుంది. శని ప్రత్యక్ష సంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తాడు. శని ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jul 07, 2025 10:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శని ప్రత్యక్ష సంచారం 12 రాశుల వారిపై కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. 2025లో మూడు రాశుల వారు శని ప్రత్యక్ష సంచారం కారణంగా అనేక లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి శనిప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శని సంచారంలో మార్పు
శని సంచారంలో మార్పు

శని మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు. శని గురువు రాశి అయినటువంటి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ నెలలో, అంటే జూలై నెలలో శని ప్రత్యక్షంగా ఉంటుంది. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఉంటుంది. శని ప్రత్యక్ష సంచారం 12 రాశులవారిపై ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తాడు. శని ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి శని ప్రత్యక్ష సంచారంతో శుభ ఫలితాలు:

1.వృషభ రాశి:

వృషభరాశి వారికి శని ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కెరియర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. ప్రేమ జీవితం కూడా మధురంగా మారుతుంది. జీవితంలో సంతోషంగా ఉంటారు.

2.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి కూడా శని ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలను పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి.

3.కుంభ రాశి:

కుంభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్థిక పరంగా కూడా సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More