2వ రోజు గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు.. శక్తివంతమైన గాయత్రీ స్త్రోత్రం, మంత్రాలు చదివితే అష్టైశ్వర్యాలు, ఆర్థికాభివృద్ధి!

అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధించి నైవేద్యాలని సమర్పిస్తాము. రెండవ రోజు గాయత్రి రూపంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఈరోజు గాయత్రీ దేవిని పూజించేటప్పుడు వీటిని తప్పక చదువుకోండి. దీనితో అమ్మ అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండచ్చు. శక్తివంతమైన గాయత్రీ స్త్రోత్రం, మంత్రాలు చదివితే కూడా మంచి జరుగుతుంది.

Published on: Sep 23, 2025, 09:49:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నవరాత్రులు సెప్టెంబర్ 22 అంటే నిన్నటి నుంచి మొదలయ్యాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఆరాధించి అమ్మవారికి నైవేద్యాలని సమర్పిస్తాము.

గాయత్రీ స్త్రోత్రం, మంత్రాలు (pinterest)
గాయత్రీ స్త్రోత్రం, మంత్రాలు (pinterest)

రెండవ రోజు గాయత్రిరూపంలో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు. ఈరోజు గాయత్రీ దేవిని పూజించేటప్పుడు వీటిని తప్పక చదువుకోండి. దీనితో అమ్మ అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండచ్చు.

గాయత్రీ స్త్రోత్రం

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేక్షరీ

అజరే మరే మాతా త్రాహి మాం భవసాగరాత్ (1)

నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికే మలే

బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోస్తు తే (2)

అనంతకోటి బ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ

నిత్యానందే మహామాయే పరేశానీ నమోస్తుతే (3)

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా

మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః (4)

పూషార్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః

పితరో నాగయక్షాంశ్చ గంధర్వాప్సరసాం గణాః (5)

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ

ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ (6)

త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః

పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ (7)

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ

బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ (8)

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా

పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే (9)

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే

స్వాహాకారేగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ (10)

నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్

సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ (11)

అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతానిచ

మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే (12)

శక్తివంతమైన గాయత్రీ దేవి మంత్రాలు

ఈ మంత్రాలను గాయత్రీ దేవిని పూజించేటప్పుడు పఠిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలుకలుగుతాయి. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈతి బాధలు వంటివి పోతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది.

1.గణేశ గాయత్రి మంత్రం:

ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి.. తన్నోదంతిః ప్రచోదయాత్...

2.నృసింహ గాయత్రి మంత్రం

ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి.. తన్నో నృసింహః ప్రచోదయాత్..

3.శివ గాయత్రి మంత్రం

ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నోరుద్రః ప్రచోదయాత్..

4.విష్ణు గాయత్రి మంత్రం

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి.. తన్నోవిష్ణుః ప్రచోదయాత్..

5.కృష్ణ గాయత్రి మంత్రం

ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి.. తన్నోకృష్ణ ప్రచోదయాత్..

6.లక్ష్మీ గాయత్రి మంత్రం

ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి.. తన్నోలక్ష్మీః ప్రచోదయాత్..

7.దుర్గా గాయత్రి మంత్రం

ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి.. తన్నోదుర్గా ప్రచోదయాత్..

8.హంస గాయత్రి మంత్రం

ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి.. తన్నోహంసః ప్రచోదయాత్..

9.తులసీ గాయత్రి మంత్రం

ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి.. తన్నో బృందాః ప్రచోదయాత్..

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More