...
...
Next Story

ఈ 5 జంతువులు పదే పదే కలలో కనపడితే అదృష్టమే.. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది!

స్వప్న శాస్త్రం ప్రకారం కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలుపుతాయి. మనకు కలల్లో జంతువులు కూడా కనబడతాయి. నిజానికి జంతువులు కలలో కనబడితే శుభప్రదంగా భావించాలి. మరి కలలో ఎటువంటి జంతువులు కనబడితే మంచిది అనేది చూద్దాం.

Published on: Jun 4, 2025, 15:00:06 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలను గుర్తుపెట్టుకుంటాం, కానీ కొన్ని కలలు మర్చిపోతూ ఉంటాం. ఒక్కోసారి భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. మన మానసిక స్థితికి ప్రతిరూపం కళ అని స్వప్న శాస్త్రం చెప్తోంది.

ఈ 5 జంతువులు పదే పదే కలలో కనపడితే అదృష్టమే
ఈ 5 జంతువులు పదే పదే కలలో కనపడితే అదృష్టమే

కలల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ జంతువులు పదే పదే కనబడితే అదృష్టానికి సంకేతంగా భావించాలి. మరి ఎలాంటి జంతువులు కలలో కనబడితే మంచిది? వేటివల్ల అదృష్టం వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలుభవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలుపుతాయి. మనకు కలల్లో జంతువులు కూడా కనబడతాయి. నిజానికి జంతువులు కలలో కనబడితే శుభప్రదంగా భావించాలి. మరి కలలో ఎటువంటి జంతువులు కనబడితే మంచిది అనేది చూద్దాం.

కలలో ఈ జంతువులు కనపడితే మంచిది

1.ఏనుగు

కలలో ఏనుగు కనబడితే మంచి జరుగుతుంది. అదృష్టంకలిసి వస్తుంది. సంపద, శ్రేయస్సును పొందవచ్చు. సుఖసంతోషాలు కలుగుతాయి. ఎవరికైతే కలలో ఏనుగు కనబడుతుందో వారికి మంచి రోజులు మొదలవుతాయి.

2.ఆవు

కలలో ఆవు కనబడితే కూడా మంచి జరుగుతుంది. అదృష్టంగా భావించాలి. కలలో ఆవు–దూడలను చూడడం శుభ సంకేతం. ఎవరి కలలో అయితే ఆవు దూడ కనబడతాయో వారికి భగవంతుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.

3.పాము

కలలో నల్ల పాము కనబడితే ఎంతో మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కీర్తి పెరుగుతుందని ఈ కల వెనుక అర్థం. కోరికలు కూడా నెరవేరుతాయి.

4.కుందేలు

కలలో కుందేలు కనబడితే కూడా మంచి జరుగుతుంది. జీవితంలో ప్రేమ పెరుగుతుందని ఇది సూచిస్తుంది. ప్రతి దాంట్లో కూడా విజయాన్ని అందుకోవచ్చు.

5.గుడ్లగూబ

కలలో గుడ్లగూబతరచుగా కనబడుతున్నట్లయితే సంపద పెరుగుతుందని దానికి అర్థం. గుడ్లగూబ కలలో కనబడితే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయట.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe