Ugadi Rasi Phalalu 2025: సింహ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది శుభకార్యాలు జరుపుతారు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి

Ugadi Rasi Phalalu 2025: సింహ రాశి జాతకులకు విశ్వావసు నామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా వున్నాయి? సింహ రాశి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

Published on: Mar 11, 2025 8:02 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సింహం (మఖ: పుబ్బ: ఉత్తర 1వ పాదం)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా

సింహ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు (pinterest)
సింహ రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు (pinterest)

గురుడు వృషభ రాశి సంచారంతో ధననష్టం

గురుడు ఈ సంవత్సరం ఉగాదినుండి 14.5.25 వరకు వృషభంలో ఉంటాడు. దీనితో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించాలి.

15.5.25 నుంచి 19.10.25 వరకు గురుడు మిథునంలో ఉంటాడు. దీనితో అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలువింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు.

కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్య మేర్పడకుండా జాగ్రత్త అవసరం.

శని మీన రాశి సంచారంతో కలహాలు

శనిఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ముంటుంది. ధన నష్టాన్ని అధిగమించుటకు ఋణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.

రాహువు మీన రాశి సంచారంతో మానసిక ఆందోళన దూరం

రాహువుఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు మీనంలో ఉంటాడు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం తొలగిపోతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. 19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలోఉంటాడు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

కేతువు కన్య రాశి సంచారంతో ధన లాభం

కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18.5.25 వరకు కన్యలో ఉంటాడు. కుటుంబపరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంలో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.

19.5.25 నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు. ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మికకార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.

చికాకులు, ఒత్తిళ్ళు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా, బృహస్పతిమే నుండి లాభ స్థానమునందు సంచరించటం, శని 8వ స్థానమునందు (అష్టమ శని ప్రభావం) సంచరించుట చేత, రాహువు మే నుండి ఏడవ స్థానము నందు, కేతువు మే నుండి ఒకటవ స్థానమునందు సంచరించుట చేత సింహ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి.

సింహ రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుచున్నాయి. కుటుంబ సమస్యలు, గొడవలు అధికమగు సూచన. అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి. జన్మ కేతువు ప్రభావం చేత పనులలో చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. లాభ స్థానములో గురుని అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికి మనోధైర్యముతో పూర్తి చేస్తారు.

ఎవరికి ఎలా?

  1. సింహ రాశి విద్యార్థులు కష్టపడవలసిన సమయం.
  2. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. స్త్రీలుకుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యహరించడం మంచిది.
  3. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. సింహ రాశి వారికి కోర్టు విషయాలు, వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును.
  4. సింహ రాశి రైతాంగం వంటి రంగాల వారికి సమస్యలు అధికముగా ఉండును.
  5. సినీ రంగం, మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి.
  6. సింహ రాశి వారికి అష్టమ శనిప్రభావంచేత పనుల యందు చికాకులు, అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు కనబడుచున్నాయి. రాహు కేతువుల ప్రభావంచేత కుటుంబ సమస్యలు, ఆందోళనలు, ఒత్తిడులు అధికమగును. పనుల యందు ఆచితూచి వ్యవహరించాలని సూచన. గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన.

సింహరాశి వారు పాటించాల్సిన పరిహారాలు

సింహ రాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందడం కోసం శనివారంశనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించండి.

మాసవారి ఫలితములు

ఏప్రిల్ నెల

ఈ మాసం మధ్యస్థ ఫలితాలున్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. తీర్థయాత్రలుచేస్తారు. అపవాదులు వచ్చును. మానసిక ఆనందము. పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

మే నెల

ఈ మాసంమీకు మధ్యస్థంగా ఉన్నది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. భార్య వలన సౌఖ్యం. అలంకార ప్రాప్తి. అధికారులతో ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అధికమగును.

జూన్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. సాధ్యం కాని పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. వాహనప్రమాదము. శ్రద్ధతో పని చేస్తారు. కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తారు.

జూలై నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకొన్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. శుభవార్తలువింటారు.

ఆగస్టు నెల

ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములున్నవి. కొత్త వారితో పరిచయాలుంటాయి. సంఘములో మంచి గౌరవముంటుంది. ఉద్యోగప్రయత్నములు చేస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ మూలక ధన లాభం. తలపెట్టిన పనులు పూర్తగును.

సెప్టెంబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది. ఆనందముగా గడిపెదరు. వస్త్రములు, ఆభరణములు కొంటారు. ఖర్చులుఅధికమగును. మీరు మొదలుపెట్టిన పనులు ఫలించును. వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రారంభములకు తపన పడతారు.

అక్టోబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువుల వలన ధన వ్యయమగును. స్త్రీసౌఖ్యము. ప్రయాణములలో చోర భయము. విదేశీయానం. ప్రముఖుల ద్వారా కలసివచ్చును. పనులు సకాలంలో పూర్తి కావు.

నవంబర్ నెల

ఈ మాసంమీకు అనుకూలంగా లేదు. అనుకోని ఖర్చులుంటాయి. వస్త్ర లాభములు. భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారముంటుంది. ప్రమాద సూచనలున్నాయి. ఇంటర్వ్యూలలో వైఫల్యం. స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం.

డిసెంబర్ నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో కలహాలు ఉంటాయి. శుభ కార్యములకు ఆటంకములు. స్త్రీ విరోధములు. విలువ గల వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు. కోర్టు వ్యవహారాలలో నిరాశ. ధన వ్యయం.

జనవరి నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక క్షోభ, భయాందోళనలు ఏర్పడును. స్త్రీ మూలకధన నష్టం ఉంటుంది. ప్రమోషన్లు ఉంటాయి. ధన నష్టముంటుంది. దూరపు ప్రయాణాలుంటాయి. నూతన ప్రయత్నములు చేస్తారు. కుటుంబ అనుకూలత.

ఫిబ్రవరి నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువులతో విరోధములుంటాయి. మనోధైర్యము, సంతానమోసం. శుభకార్యాలు కలసివచ్చును. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. నూతన ప్రయత్నములు చేస్తారు. మతధార్మిక విషయాలలో కీలకపాత్ర.

మార్చి నెల

ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. దేవాలయ దర్శనములు చేస్తారు. భార్య వలన ఇబ్బందులు ఏర్పడతాయి. అనారోగ్య సూచనలున్నాయి. విపరీతమైన ఖర్చులుంటాయి. మరణవార్తలు వింటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆదాయం అంతగా ఉండదు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి