శ్రావణ పౌర్ణమికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హిందూ సనాతన ధర్మంలో శ్రావణమాసానికి, అందులో పౌర్ణమికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. శ్రావణ పౌర్ణమి నాడు శివుడు, పార్వతీ దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ పౌర్ణమి నాడు నదీ స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం వలన కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి కొన్ని పరిహారాలను పాటిస్తే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.

శ్రావణ పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి కళలతో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. పౌర్ణమి రాత్రి మనసు, శరీరంపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం, పౌర్ణమి రోజు రాత్రి వేళ కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
చంద్ర దర్శనం
చంద్ర దర్శనం అత్యంత ప్రాధానం. పౌర్ణమి రోజు రాత్రి చంద్రోదయమైన తర్వాత చల్లటి వెన్నెలలో కాసేపు సమయాన్ని గడిపితే ఆరోగ్యంగా ఉండొచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో ఆవు పాలతో చేసిన పాయసం లేదా పాలను వెన్నెల్లో పెట్టి, కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. చంద్రుడికి వెండి పాత్రలో పాలు లేదా నీటితో అర్ఘ్యం సమర్పిస్తే చంద్ర దోషాలు తొలగిపోతాయి.
లక్ష్మీ పూజ
పౌర్ణమి రోజు రాత్రి మహాలక్ష్మి దేవిని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ఆ రోజు రాత్రి పూజా గదిలో అమ్మవారి ముందు దీపం వెలిగించి, సూక్తం లేదా కనకధార స్తోత్రం పఠిస్తే మంచిది. అలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాత్రి పూట దీపం ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను చూడొచ్చు.
జపాలు, దానధర్మాలు
ఈ పవిత్రమైన రోజున పేదలకు అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తెల్లని వస్తువులు అంటే బియ్యం, పాలు వంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇష్టదైవం మంత్రాలను, “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే మనసులో అశాంతి తొలగిపోయి, ఏకాగ్రతను పొందవచ్చు.
{{/usCountry}}ఈ పవిత్రమైన రోజున పేదలకు అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తెల్లని వస్తువులు అంటే బియ్యం, పాలు వంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇష్టదైవం మంత్రాలను, “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే మనసులో అశాంతి తొలగిపోయి, ఏకాగ్రతను పొందవచ్చు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.