Lord Ram: రామ అష్టోత్తర శతనామావళి, రామ రక్షా స్తోత్రం!

శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలో శ్రీరాముని అష్టోత్తర శతనామావళిని చదువుతారు. అలాగే రామరక్షా స్తోత్రాన్ని కూడా చదువుకుంటారు. ఈరోజు శ్రీరామ అష్టోత్తర శతనామావళి, శ్రీరామ రక్షాస్తోత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. రోజు వారి పూజలు చేసేటప్పుడు కూడా  రామ అష్టోత్తర శతనామావళి, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవచ్చు.

Published on: Mar 24, 2026, 17:00:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రామ అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ రామాయ నమః

Lord Ram: రామ అష్టోత్తర శతనామావళి, శ్రీ రామ రక్షా స్తోత్రం (pinterest)
Lord Ram: రామ అష్టోత్తర శతనామావళి, శ్రీ రామ రక్షా స్తోత్రం (pinterest)

ఓం రామభద్రాయ నమః

ఓం రామచంద్రాయ నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం రాజీవలోచనాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం రాజేంద్రాయ నమః

ఓం రఘుపుంగవాయ నమః

ఓం జానకీ వల్లభాయ నమః

ఓం జైత్రాయ నమః

ఓం జితామిత్రాయ నమః

ఓం జనార్దనాయ నమః

ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః

ఓం దాంతాయ నమః

ఓం శరణత్రాణ తత్పరాయ నమః

ఓం వాలి ప్రమథనాయ నమః

ఓం వాగ్మినే నమః

ఓం సత్యవాచే నమః

ఓం సత్య విక్రమాయ నమః

ఓం సత్యవ్రతాయ నమః

ఓం వ్రతధరాయ నమః

ఓం సదా హనుమదాశ్రితాయ నమః

ఓం కౌసలేయాయ నమః

ఓం ఖరధ్వంసినే నమః

ఓం విరాధవధ పండితాయ నమః

ఓం విభీషణ పరిత్రాత్రే నమః

ఓం హరకోదండ ఖండనాయ నమః

ఓం సప్తతాళ ప్రభేత్త్రే నమః

ఓం దశగ్రీవ శిరోహరాయ నమః

ఓం జామదగ్న్య మహాదర్పదలనాయ నమః

ఓం తాటకాంతకాయ నమః

ఓం వేదాంతసారాయ నమః

ఓం వేదాత్మనే నమః

ఓం భవరోగస్యభేషజాయ నమః

ఓం దూషణత్రిశిరోహంత్రే నమః

ఓం త్రిమూర్తయే నమః

ఓం త్రిగుణాత్మకాయ నమః

ఓం త్రివిక్రమాయ నమః

ఓం త్రిలోకాత్మనే నమః

ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః

ఓం త్రిలోక రక్షకాయ నమః

ఓం ధన్వినే నమః

ఓం దండకారణ్య కర్తనాయ నమః

ఓం అహల్యాశాప శమనాయ నమః

ఓం పితృభక్తాయ నమః

ఓం వరప్రదాయ నమః

ఓం జితేంద్రియాయ నమః

ఓం జితక్రోధాయ నమః

ఓం జితామిత్రాయ నమః

ఓం జగద్గురవే నమః

ఓం ఋక్షవానర సంఘాతినే నమః

ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః

ఓం జయంతత్రాణ వరదాయ నమః

ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః

ఓం సర్వదేవాధిదేవాయ నమః

ఓం మృతవానర జీవనాయ నమః

ఓం మాయామారీచ హంత్రే నమః

ఓం మహాదేవాయ నమః

ఓం మహాభుజాయ నమః

ఓం సర్వదేవస్తుతాయ నమః

ఓం సౌమ్యాయ నమః

ఓం బ్రహ్మణ్యాయ నమః

ఓం మునిసంస్తుతాయ నమః

ఓం మహాయోగినే నమః

ఓం మహోదారాయ నమః

ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః

ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః

ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః

ఓం ఆదిపురుషాయ నమః

ఓం పరమపురుషాయ నమః

ఓం మహాపురుషాయ నమః

ఓం పుణ్యోదయాయ నమః

ఓం దయాసారాయ నమః

ఓం పురాణ పురుషోత్తమాయ నమః

ఓం స్మితవక్త్రాయ నమః

ఓం మితభాషిణే నమః

ఓం పూర్వభాషిణే నమః

ఓం రాఘవాయ నమః

ఓం అనంతగుణ గంభీరాయ నమః

ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః

ఓం మాయామానుష చారిత్రాయ నమః

ఓం మహాదేవాది పూజితాయ నమః

ఓం సేతుకృతే నమః

ఓం జితవారాశయే నమః

ఓం సర్వతీర్థమయాయ నమః

ఓం హరయే నమః

ఓం శ్యామాంగాయ నమః

ఓం సుందరాయ నమః

ఓం శూరాయ నమః

ఓం పీతవాససే నమః

ఓం ధనుర్ధరాయ నమః

ఓం సర్వయజ్ఞాధిపాయ నమః

ఓం యజ్వినే నమః

ఓం జరామరణ వర్జితాయ నమః

ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః

ఓం సర్వావ గుణవర్జితాయ నమః

ఓం పరమాత్మనే నమః

ఓం పరస్మై బ్రహ్మణే నమః

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః

ఓం పరస్మై జ్యోతిషే నమః

ఓం పరస్మై ధామ్నే నమః

ఓం పరాకాశాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం పరేశాయ నమః

ఓం పారగాయ నమః

ఓం పారాయ నమః

ఓం సర్వదేవాత్మకాయ నమః

ఓం పరస్మై నమః

ఇతి శ్రీ రామ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శ్రీ రామ రక్షా స్తోత్రం

ధ్యానం

ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం

పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్

వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం

నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామ చంద్రమ్..

స్తోత్రం

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ 1

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్

జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ 2

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్

స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ 3

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్

శిరో మే రాఘవః పాతు ఫాలం (భాలం) దశరథాత్మజః 4

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియః శృతీ

ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః 5

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః

స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః 6

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్

మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః 7

సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్ ప్రభుః

ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ 8

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః

పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః 9

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్

స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ 10

పాతాళ భూతల వ్యోమ చారిణ శ్చద్మ చారిణ:

న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః 11

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్

నరోన లిప్యతే పాపైర్భుక్తిం ముక్తించ విందతి 12

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్

యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః 13

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్

అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ 14

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః

తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః 15

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్

అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః 16

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ

పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ 17

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ

పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ 18

శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్

రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ 19

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ

రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ 20

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా

గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః 21

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ

కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః 22

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః

జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః 23

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః

అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః 24

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాససమ్

స్తువంతి నామభిర్దివ్యైర్న తే సంసారిణో నరాః 25

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం

కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం

వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ 26

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 27

శ్రీరామ రామ రఘునందన రామ రామ

శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ

శ్రీరామ రామ శరణం భవ రామ రామ 28

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి

శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి

శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి

శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే 29

మాతా రామో మత్ పితా రామచంద్ర:

స్వామీ రామో మత్ సఖా రామచంద్ర:

సర్వస్వం మే రామచంద్రో దయాళు:

నాన్యం జానే నైవ జానే న జానే 30

దక్షిణే లక్ష్మణో యస్య వామే చ (తు) జనకాత్మజా

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ 31

లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే 32

మనోజవం మారుత తుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్

వాతాత్మజం వానరయూథ ముఖ్యం

శ్రీరామదూతం శరణం ప్రపద్యే 33

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్

ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ 34

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ 35

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్

తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ 36

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర 37

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 38

ఇతి శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణమ్

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More