ఈ ఆలయంలో కార్లు నెంబర్ ప్లేట్లను చెట్టుకు కడితే ప్రమాదం జరగదట.. ఈ మహిమగల ఆలయ వివరాలు ఇవిగో!

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. తునికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిత్యం ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం చుట్టూ కొండలు, లోయలు ఉంటాయి. ఈ కారణంగా ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, అందమైన వాతావరణంతో నిండి ఉంటుంది. 

Published on: Sep 17, 2025, 13:30:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తలుపులమ్మ లోవ ఆలయం గురించి మీరు వినే ఉంటారు. తలుపులమ్మ తల్లి అమ్మవారు అక్కడ కొలువై ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. తునికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నిత్యం ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయం చుట్టూ కొండలు, లోయలు ఉంటాయి. ఈ కారణంగా ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, అందమైన వాతావరణంతో నిండి ఉంటుంది.

ఈ ఆలయంలో కార్లు నెంబర్ ప్లేట్లను చెట్టుకు కడితే ప్రమాదం జరగదట (pinterest)
ఈ ఆలయంలో కార్లు నెంబర్ ప్లేట్లను చెట్టుకు కడితే ప్రమాదం జరగదట (pinterest)

స్వయంభు వెలసిన అమ్మవారు

తలుపులమ్మతల్లి ఈ ఆలయంలోస్వయంగా వెలిశారు. అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని ఎందుకంటారు అంటే, అమ్మవారు భక్తులకు వరాలు ఇవ్వడానికి తలపు సరిపోతుందని (తలపు అంటే ఆలోచన అని అర్థం). అందుకే తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. ప్రమాదాల నుంచి కాపాడుతుందని విశ్వాసం.

చెట్టుకి నెంబర్ ప్లేట్లు

ఇక్కడ తలుపులమ్మ తల్లి ఆలయందగ్గర ఉన్న చెట్టుకి వాహన నెంబర్ ప్లేట్లను కడతారు. కొంత మంది వాహన నెంబర్ ప్లేట్లను కట్టకుండా, వాహన రిజిస్ట్రేషన్ అంకెను దేని మీదైనా రాసి చెట్టుకి తగిలిస్తూ ఉంటారు. అలా చెట్టుకి తగిలించడం వలన వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరగవు అని నమ్ముతారు. తలుపులమ్మ తల్లి ప్రమాదాల నుంచి కాపాడుతుందని ఉద్దేశంతో చాలా మంది ఈ పద్దతిని అనుసరిస్తారు.

కొత్త వాహనాలను కొనుగోలు చేసిన చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడే పూజలు జరుపుతారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా భక్తిశ్రద్ధలతో అక్కడ గోడలపై చిత్రీకరిస్తారు. అదే విధంగా ఇక్కడ గుడి దగ్గర గుడారాలు వేసుకుని చాలా మంది జంతు బలులు అర్పిస్తారు.

ఆలయ చరిత్ర:

ఈ ప్రదేశాన్ని చూసిన ఆగస్త్య మహర్షి ఎంతో ఆకర్షితుడై ఇక్కడ స్థిరపడి ధ్యానం చేశాడని పురాణ కథనం. ఈ పర్వతాల నుంచి పండ్లు తిని, నీరు తాగే వారట. ఈ పర్వతాలకు దారకొండ, తీగకుండ అని పేర్లు పెట్టారట. దారకొండ నుంచి వచ్చే వాగును ఇప్పుడు కూడా చూడొచ్చు.

ఈ ఆలయంలో నిర్వహించే ప్రధాన పండుగలు:

ఈ ఆలయంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు. ఆషాడమాస ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుతారు. వార్షిక జాతర చైత్ర బహుళ విదియ నుంచి చైత్ర బహుళ అమావాస్య దాకా 15 రోజులు పాటు ఉంటుంది. ఆషాడ మాస ఉత్సవాలను ఆషాడ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాడ బహుళ అమావాస్య దాకా ఉంటాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More