సూర్యుడు, గురువుపై రాహువు ప్రభావం, నాలుగు రాశులకు చిన్నపాటి సమస్యలు.. ఈ తప్పులు చేయకుండా చూసుకోండి!

రాహువు ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు. దీంతో రాహువు పంచమ దృష్టి ప్రభావం రెండు గ్రహాలపై పడుతుంది. గురువుతో, సూర్యుడుతో రాహువుకి శత్రు సంబంధం ఉండడం వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు రావచ్చో తెలుసుకుందాం. 

Published on: Jun 12, 2025, 15:15:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జూన్ 15 ఆదివారం నాడు సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దాంతో పాటుగా 12 ఏళ్ల తర్వాత గురువుతో సంయోగం చెందుతాడు. ఈ సమయంలోనే రాహువు రెండు గ్రహాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది.

సూర్యుడు, గురువుపై రాహువు ప్రభావం, నాలుగు రాశులకు చిన్నపాటి సమస్యలు (pinterest )
సూర్యుడు, గురువుపై రాహువు ప్రభావం, నాలుగు రాశులకు చిన్నపాటి సమస్యలు (pinterest )

రాహువు ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. దీంతో రాహువు పంచమ దృష్టి ప్రభావం రెండు గ్రహాలపై పడుతుంది. గురువుతో, సూర్యుడుతో రాహువుకి శత్రు సంబంధం ఉండడం వలన కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఐదురాశులు వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్‌లో కూడా సమస్యలు రావచ్చు. మరి ఈ సమయంలో ఏ రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి?, ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వంటి విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.

1.మకర రాశి

మకరరాశి 6వ ఇంట్లో గురువు, సూర్యుడు సంయోగం జరుగుతుంది. దీంతో శత్రువుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు వంటి విషయాల్లో తీసుకోవాలనుకుంటే కొంత సమయం ఆగడం మంచిది. ఒకవేళ ఈ సమయంలో రుణాలు తీసుకుంటే తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

2.కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి ఈ సమయంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూర్యుడు, గురువు కలయిక 12వ ఇంట్లో జరగడంతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. అనవసరంగా డబ్బులు వృథా అవుతాయి. ఆకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. ఆదా చేసిన సంపాదన మొత్తం కరిగిపోతుంది. విదేశీ పర్యటనలు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు ఈ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

3.సింహ రాశి

సింహరాశి వారికి సూర్యుడు, గురువు సంయోగం చెందడంతో కొంతమేరకు ఇబ్బందులు వస్తాయి. సోదరులతో ఇబ్బందులు రావచ్చు. మీ ప్రతిని తగ్గే పనులు చేయడం మంచిది కాదు. కొన్ని అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. కొన్ని విషయాల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.

4.మీన రాశి

మీనరాశి వారికి సూర్యుడు, గురువు కలయిక నాలుగవ ఇంట్లో జరగడంతో డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వాహనాలు, ఇతర వస్తువుల కోసం డబ్బుని ఖర్చు చేస్తారు. తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. వివాహితులకు ఈ కాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించి వివాదాలు ఎదుర్కొంటారు.కొంతమేరకు భావోద్వేగానికి లోనవ్వడం వలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More