Sun Jupiter Conjunction: మరి కొన్ని రోజుల్లో గురు-సూర్య గ్రహాల కలయిక.. ఐదు రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం!
ప్రస్తుతం గురు గ్రహం మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ గురు ఆదిత్య యోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కొన్ని రాశుల వారు పొందబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఎవరు?
గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే నక్షత్ర సంచారంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. కొన్ని సార్లు రెండు, మూడు గ్రహాల సంయోగం కూడా చూస్తూ ఉంటాం. గ్రహాల కలయిక అనేది చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం గురు గ్రహం మీన రాశిలో సంచారం చేస్తున్నాడు.

మార్చి 15న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ గురు ఆదిత్య యోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కొన్ని రాశుల వారు పొందబోతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.
మరి కొన్ని రోజుల్లో గురు-సూర్య గ్రహాల కలయిక.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించబోతోంది
1.మిథున రాశి
మిథున రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల కలయిక వలన ఏర్పడే యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగులు ప్రమోషన్‌ను పొందుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఈ సమయంలో ఈ రాశి వారు పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. అనేక విధాలుగా కలిసి వస్తుంది.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి గురు ఆదిత్య యోగం మంచి ఫలితాలను అందిస్తుంది. అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు; అవి లాభదాయకంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త మార్గాలు బాగా కలిసి వస్తాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.
3.మేష రాశి
మేష రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల కలయిక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం ఎక్కువవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
4.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలను వింటారు. పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వస్తాయి. సృజనాత్మక రంగాల్లో బాగా రాణిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
5.మీన రాశి
మీన రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం, ప్రేమ పెరుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












