సూర్యుడు-బుధుడు-గురువు సంయోగంతో శక్తివంతమైన బ్రహ్మ ఆదిత్య యోగం, ఈ 3 రాశులకు వరం!

జూన్ 15న సూర్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. పైగా బుధుడు, గురువు కూడా ఇప్పటికే అదే రాశిలో ఉన్నారు. మూడు ముఖ్యమైన గ్రహాల కదలిక ఒక ప్రత్యేక యాదృచ్ఛికతను సృష్టిస్తోంది. అదే బ్రహ్మ ఆదిత్య యోగం. ఈ యోగం ఏ రాశిలో వారిని ఎలా ప్రభావితం చేస్తుందో చూసేద్దాం.

Published on: Jun 16, 2025, 09:00:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బ్రహ్మ ఆదిత్య యోగం జూన్ 15 అంటే నిన్నటి నుంచి మొదలైంది. ఈ కారణంగా మూడు రాశుల వారికి శుభవార్తలు అందుతాయి. గ్రహాలుకాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అవి మన జీవితంలో అనేక అంశాలను ప్రభావితం చేస్తాయి.

సూర్యుడు-బుధుడు-గురువు సంయోగంతో శక్తివంతమైన బ్రహ్మ ఆదిత్య యోగం (pinterest)
సూర్యుడు-బుధుడు-గురువు సంయోగంతో శక్తివంతమైన బ్రహ్మ ఆదిత్య యోగం (pinterest)

ఈ సంవత్సరం జూన్ 15న సూర్యుడువృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. పైగా బుధుడు, గురువు కూడా ఇప్పటికే అదే రాశిలో ఉన్నారు. మూడు ముఖ్యమైన గ్రహాల కదలిక ఒక ప్రత్యేక యాదృచ్ఛికతను సృష్టిస్తోంది. అదే బ్రహ్మ ఆదిత్య యోగం.

ఈ బ్రహ్మ ఆదిత్య యోగం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇది కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వృత్తి, వ్యాపార, సామాజిక జీవితంలో విజయానికి కారణం అవుతుంది.

ఈ యోగం ఏ రాశిలో వారిని ఎలా ప్రభావితం చేస్తుందో చూసేద్దాం:

1.మిథున రాశి

మిథునరాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు ఏర్పరచిన ఈ యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి వారిపై నమ్మకం పూర్తిగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఈ రాశి వారికి పేరు, ప్రఖ్యాతి కూడా పెరుగుతాయి. గౌరవం కూడా పెరుగుతుంది.

2.సింహ రాశి

సింహరాశి వారికి ఈ సమయంలో మంచి జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ప్రశాంతత ఉంటుంది.

3.ధనస్సు రాశి

ధనస్సురాశి వారికి ఈ శక్తివంతమైన కలయిక అనేక లాభాలను అందిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. సక్సెస్‌ను అందుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More