ఈ 3 రాశుల వారికి మంచి సమయం మొదలైంది, సూర్యుని అనుగ్రహంతో శుభవార్తలు, వైవాహిక జీవితంలో సంతోషాలు ఇలా అనేకం!

సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తూ ఉంటాడు. నెలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరోసారి సూర్యుడు తన గమనాన్ని మారుస్తున్నాడు. సూర్యుడి కదలిక శుభ ఫలితాలను తీసుకు వస్తుంది.

Published on: Aug 4, 2025, 14:00:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు రెండూ ఏర్పడతాయి. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తూ ఉంటాడు. నెలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభఫలితాలు ఎదురవుతాయి. మరోసారి సూర్యుడు తన గమనాన్ని మారుస్తున్నాడు. సూర్యుడి కదలిక శుభ ఫలితాలను తీసుకు వస్తుంది.

ఈ 3 రాశుల వారికి మంచి సమయం మొదలైంది, సూర్యుని అనుగ్రహంతో శుభవార్తలు
ఈ 3 రాశుల వారికి మంచి సమయం మొదలైంది, సూర్యుని అనుగ్రహంతో శుభవార్తలు

సూర్యుడుఆగస్టు 3 ఉదయం 4:16 గంటలకు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ నక్షత్ర మండలానికి అధిపతి బుధుడు. బుధుడు నక్షత్ర మండలంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి.

మరి సూర్యుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

ఆశ్లేష నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు

1.తులా రాశి

బుధుడినక్షత్రంలో సూర్యుని సంచారం తులా రాశి ప్రజలకు మేలు చేస్తుంది. మీరు పని చేసే రంగంలో ఎదురయ్యే ఇబ్బందులు ఆటోమేటిగ్గా సమసిపోతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు బాస్, సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. సంతోషంగా వుంటారు అదే సమయంలో దాంపత్య జీవితంలో కూడా గౌరవం ఉంటుంది.

2.వృశ్చిక రాశి :

బుధుడి నక్షత్రంలో సూర్యుని సంచారం వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యుని యొక్క శుభ ప్రభావాల కారణంగా, మీరు హోదా, ప్రతిష్ఠలో పెరుగుదలను చూడచ్చు. అదే సమయంలో పేరు, ఉద్యోగం రెండూ సమాజంలో గౌరవాన్ని పొందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అదే సమయంలో కొందరు తమ సోదరితో సమయాన్ని గడుపుతారు. సూర్యుని అనుగ్రహంతో ఆగిపోయిన పనులు పూర్తి కాగలవు.

3.మీన రాశి :

మీన రాశి వారికి బుధుడి నక్షత్రంలో సూర్యుని ప్రవేశం చాలా శుభప్రదంగా భావిస్తారు. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. సూర్యగ్రహం అనుగ్రహంతో విద్యార్థుల మనసు చదువులో నిమగ్నమవుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదే సమయంలో ఆర్థిక సమస్యలను కూడా క్రమంగా అధిగమించవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More