ఈ 3 రాశులకు నవంబర్ 1 నుంచి స్వర్ణ కాలం మొదలు.. డబ్బు, సంపద, సంతోషంతో పాటు ఎన్నో!

గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుజ నక్షత్ర సంచారం ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది?

Published on: Oct 25, 2025, 08:00:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కుజ నక్షత్ర సంచారం నవంబర్: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. దీంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుజ నక్షత్ర సంచారం
కుజ నక్షత్ర సంచారం

కుజ సంచారంలో మార్పు

ఇది ఇలా ఉంటే, కుజుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాడు. నవంబర్ నెలలో చూసినట్లయితే, నక్షత్రాన్ని మారుస్తాడు. అనురాధ నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం జరుగుతుంది. నవంబర్ 1, శనివారం ఉదయం 8:28కి కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి శని. నవంబర్ 18 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు.

అనురాధ నక్షత్రం

మరి కుజ నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం. కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ రాశుల వారి సంపద పెరుగుతుంది, భూమి, భవనాలు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈ నక్షత్ర సంచారం మీకు కూడా శుభప్రదంగా ఉందో లేదో తెలుసుకోండి.

నవంబర్ 1న కుజ నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.మిథున రాశి:

మిథున రాశి వారికి కుజుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

ధైర్యం ఎక్కువవుతుంది. కష్టపడి పని చేస్తే ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ సమయంలో పురోగతి ఉంటుంది. మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పొందుతారు. సంతోషం, సంపద పెరుగుతాయి. వ్యాపారులకూ ఇది మంచి సమయం.

2.మకర రాశి:

మకర రాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎప్పటినుంచో రావాల్సిన ధనం ఈ రాశి వారి చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. శుభవార్తలు వింటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతాయి. పని ప్రాంతంలో పురోభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకూ ఇది మంచి సమయం.

3.తులా రాశి:

తులా రాశి వారికి కుజ నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటల్లో మాధుర్యం ఉంటుంది. ప్రియమైన వారి మద్దతును పొందుతారు. కుటుంబాలు వృద్ధి చెందుతాయి. ఇది కూడా మంచి సమయం. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More