...
...
Next Story

ఈ ఐదు రాశుల వారు బాగా మొండి, ఒక్కసారి ఫిక్స్ అయితే వారి మాట వారే వినరు.. మీరూనా?

కొన్ని రాశుల వారు బాగా మొండి వారు, కొన్ని రాశుల వారు ఎంతో కూల్‌గా ఉంటారు. ఇతరులు చెప్పేది వింటారు. కొన్ని రాశుల వారు మాత్రం వారు ఒకసారి ఫిక్స్ అయితే వారి మాటను కూడా వారు వినరు. ఏ రాశుల వారు మొండిగా ఉంటారు, ఎవరు ఏం చెప్పినా కూడా వినిపించుకోరో చూద్దాం.

Published on: Jul 3, 2025, 15:00:19 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

మొత్తం మనకి 12 రాశులు. రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందని చెప్పడమే కాకుండా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు.

ఈ ఐదు రాశుల వారు బాగా మొండి (pinterest)
ఈ ఐదు రాశుల వారు బాగా మొండి (pinterest)

కొన్ని రాశులవారు బాగా మొండి వారు, కొన్ని రాశుల వారు ఎంతో కూల్‌గా ఉంటారు. ఇతరులు చెప్పేది వింటారు. కొన్ని రాశుల వారు మాత్రం వారు ఒకసారి ఫిక్స్ అయితే వారి మాటను కూడా వారు వినరు. నిజానికి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మొండితనం ఉంటుంది. "నేను ఎందుకు వారి మాట వినాలి" అని అనుకుంటూ ఉంటారు. అందరిలో మొండితనం ఉన్నా, కొంతమందిలో మాత్రం ఎక్కువగా ఉంటుంది.

ఒకసారి వారు ఏదైనా ఫిక్స్ అయినట్లయితే దానిని పూర్తి చేస్తారు తప్ప, ఎవరు చెప్పినా మధ్యలో వినరు. ఈ కారణంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడతారు. జ్యోతీషశాస్త్రం ప్రకారం ఏ రాశుల వారు మొండిగా ఉంటారు, ఎవరు ఏం చెప్పినా కూడా వినిపించుకోరో చూద్దాం.

1.మేష రాశి:

మేష రాశివారు చాలా ధైర్యవంతులు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. కానీ ఒకసారి ఏదైనా ఫిక్స్ అయితే మళ్లీ వారిని వారు మార్చుకోవడానికి ఇష్టపడరు. వారు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా సరే, మళ్లీ మార్చుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడరు. ఎవరు చెప్పినా వినిపించుకోరు. ఈ మొండితనం వలన కొన్నిసార్లు మేష రాశి వారు చిక్కుల్లో పడతారు.

2.కర్కాటక రాశి:

కర్కాటకరాశి వారు ఎమోషనల్. నిజానికి మృదువుగా కనిపిస్తారు, కానీ గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం వెనక్కి తగ్గరు. మొండితనం వీరికి చాలా ఎక్కువ. అలాగే ఎవరినైనా వారు ఒక్కసారి నమ్మితే వారిపై ఏ చెడు అభిప్రాయం కూడా రాదు. ఒకవేళ ఎవరి మీదైనా చెడు అభిప్రాయం ఏర్పడితే, ఏం మంచి చేయాలన్నా సరే వీరికి నచ్చదు.

3.వృషభ రాశి:

వృషభ రాశి వారు కూడా బాగా మొండిగా ఉంటారు. ఆవేశంగా నిర్ణయాలను తీసుకుంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే, అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత వారి మాటను కూడా వారు వినరు. ఇతరులు చెప్పేది విన్నట్టు నటిస్తారు, కానీ అసలు దానిని పట్టించుకోరు. ఈ కారణంగానే వారి స్నేహితులు, బంధువులు బాధపడతారు.

4.సింహ రాశి:

మకరరాశి వారు క్రమశిక్షణతో ఉంటారు. ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. వారి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి ఒక మార్గాన్ని ఎంచుకున్న తర్వాత దానిని వదిలిపెట్టరు. ప్రొఫెషనలిజం కారణంగా వారిలో ఆ మొండితనం వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe