ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం అనేక మార్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లో సానుకూలశక్తి ప్రవహించి, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫెంగ్ షుయ్ టిప్స్‌ని ఫాలో అవ్వడం కూడా మంచిది. ఈ ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండొచ్చు. మరి ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఎలాంటి టిప్స్‌ని పాటించాలి? ఏ మార్పులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.
ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటిని ఇలా ఉంచండి, ఇక అదృష్టం మీ వెంటే:

1.ఇల్లు శుభ్రంగా ఉండాలి: ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవిఆ ఇంటికి కొలువై ఉంటుంది. ఎప్పుడు క్లీన్ చేసి ఉంచాలి. పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఇల్లు శుభ్రంగా, అందంగా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
2.ఇంటి ముఖద్వారం: ఇంటి ముఖద్వారం కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటి ముఖద్వారం ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఇంటి ముఖద్వారం ఉంటే ఆర్థికఇబ్బందులు ఉండవు, ప్రతికూల శక్తి అక్కడ ఉండదు.
3.దీపాలు, లైట్లు: సాయంత్రం పూట ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించాలి, లేదంటే లైట్లు అయినా ఉండాలి. అప్పుడు సానుకూలశక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి వెళ్ళిపోతుంది.
4.గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలి: ఇంట్లో గాలి, వెలుతురు సరిగ్గా ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
5.వాటర్ ఫౌంటెన్: ఇంట్లో వాటర్ ఫౌంటెన్ ఉంటే మంచి జరుగుతుంది, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగాఉండొచ్చు, అదృష్టం కూడా కలిసి వస్తుంది.
6.పూజ గది శుభ్రంగా: ఇంట్లో పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచి, ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే పూజ గదిని క్లీన్‌గా ఉంచాలి.
7.క్రిస్టల్స్ పెట్టండి: ఇంట్లో సానుకూల శక్తి కలగాలంటే ఇంట్లో క్రిస్టల్స్‌ని పెట్టండి. ఇవి సానుకూల శక్తిని, సంతోషాన్ని ఉంచుతాయి.
{{/usCountry}}7.క్రిస్టల్స్ పెట్టండి: ఇంట్లో సానుకూల శక్తి కలగాలంటే ఇంట్లో క్రిస్టల్స్‌ని పెట్టండి. ఇవి సానుకూల శక్తిని, సంతోషాన్ని ఉంచుతాయి.
{{/usCountry}}8.మంచి సువాసన వచ్చేలా చేయండి: ఇంట్లో మంచి సువాసనలు ఉంటే సానుకూల శక్తి ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్, అగరబత్తి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తాయి. సంతోషంగా ఉండొచ్చు, అదృష్టంకూడా కలిసి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.