ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఈ 8 మార్పులు చేయండి.. ఇక ఎల్లప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుంది!

ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫెంగ్ షుయ్ టిప్స్‌ని ఫాలో అవ్వడం కూడా మంచిది. ఈ ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండొచ్చు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఎలాంటి టిప్స్‌ని పాటించాలి? ఏ మార్పులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. 

Published on: Jul 14, 2025 1:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం అనేక మార్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లో సానుకూలశక్తి ప్రవహించి, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఫెంగ్ షుయ్ టిప్స్‌ని ఫాలో అవ్వడం కూడా మంచిది. ఈ ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండొచ్చు. మరి ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఎలాంటి టిప్స్‌ని పాటించాలి? ఏ మార్పులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.

ఫెంగ్ షుయ్ టిప్స్‌ (pinterest)
ఫెంగ్ షుయ్ టిప్స్‌ (pinterest)

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటిని ఇలా ఉంచండి, ఇక అదృష్టం మీ వెంటే:

1.ఇల్లు శుభ్రంగా ఉండాలి: ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవిఆ ఇంటికి కొలువై ఉంటుంది. ఎప్పుడు క్లీన్ చేసి ఉంచాలి. పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఇల్లు శుభ్రంగా, అందంగా ఉంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

2.ఇంటి ముఖద్వారం: ఇంటి ముఖద్వారం కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటి ముఖద్వారం ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఇంటి ముఖద్వారం ఉంటే ఆర్థికఇబ్బందులు ఉండవు, ప్రతికూల శక్తి అక్కడ ఉండదు.

3.దీపాలు, లైట్లు: సాయంత్రం పూట ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించాలి, లేదంటే లైట్లు అయినా ఉండాలి. అప్పుడు సానుకూలశక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి వెళ్ళిపోతుంది.

4.గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలి: ఇంట్లో గాలి, వెలుతురు సరిగ్గా ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, లేదంటే ప్రతికూల శక్తితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

5.వాటర్ ఫౌంటెన్: ఇంట్లో వాటర్ ఫౌంటెన్ ఉంటే మంచి జరుగుతుంది, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. సంతోషంగాఉండొచ్చు, అదృష్టం కూడా కలిసి వస్తుంది.

6.పూజ గది శుభ్రంగా: ఇంట్లో పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచి, ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే పూజ గదిని క్లీన్‌గా ఉంచాలి.

7.క్రిస్టల్స్ పెట్టండి: ఇంట్లో సానుకూల శక్తి కలగాలంటే ఇంట్లో క్రిస్టల్స్‌ని పెట్టండి. ఇవి సానుకూల శక్తిని, సంతోషాన్ని ఉంచుతాయి.

8.మంచి సువాసన వచ్చేలా చేయండి: ఇంట్లో మంచి సువాసనలు ఉంటే సానుకూల శక్తి ఉంటుంది. రూమ్ ఫ్రెషనర్, అగరబత్తి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తాయి. సంతోషంగా ఉండొచ్చు, అదృష్టంకూడా కలిసి వస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More