కార్తీక మాసం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీకమాసం చాలా పవిత్రమైన మాసం. ఈ నెలలో కొన్ని పరిహారాలను పాటించడం, దీపారాధన చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలని పొందవచ్చు. జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి.

అయితే దీపారాధన అంటే కార్తీక మాసంలో మనకి గుర్తొచ్చేది ఉసిరి దీపం. ఉసిరికాయలో వత్తులు వేసి, నెయ్యి పోసి దీపారాధన చేస్తారు. అలాగే పిండి దీపాన్ని కూడా చాలామంది వెలిగిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో వెలిగించాల్సిన దీపాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఐశ్వర్యం కలుగుతుంది
కార్తీకమాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది. శక్తివంతమైన దీపాలు వెలిగించి శివుని ఆరాధిస్తే ఎక్కువ రేట్లు ఫలితం పొందవచ్చు. ఈ నెల రోజులు కూడా ఆడవాళ్లు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోటను పూజించాలి. తులసి పూజకు ఎంతో విశిష్టత ఉంది. విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందవచ్చు. తులసి కోట ముందు దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థికపరంగా కలిసి వస్తుంది.
కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం
కార్తీక మాసంలో నది స్నానం చేస్తే కూడా ఎంతో పుణ్యం వస్తుంది. రోజూ కుదరకపోతే సోమవారం అయినా కచ్చితంగా చేయండి. కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది. అక్టోబర్ 30న వచ్చే సోమవారం నాడు ఉపవాసం ఉంటే, కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత ఫలితం కలుగుతుంది.
బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన:
కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అంటే ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించక ముందు, సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది.
నారికేళ దీపం
{{/usCountry}}కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అంటే ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించక ముందు, సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేస్తే చక్కటి ఫలితం కలుగుతుంది.
నారికేళ దీపం
{{/usCountry}}ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని సమానంగా పగిలేలా చూసుకోవాలి. ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి, మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి. ఆ తర్వాత ఐదు ఒత్తులను ఒకటిగా చేసి వెలిగించాలి. కింద పెట్టకండి. ఒక పెళ్లాం లో బియ్యం పోసి, దానిపై కొబ్బరి చిప్పను పెట్టి దీపాన్ని వెలిగించండి.
పూజా గదిలో ఉన్న శివుని ఫోటోకి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది. అలా కుదరకపోతే తులసి కోట ముందైనా వెలిగించొచ్చు. ఈ దీపం కొండెక్కిన తర్వాత, ఎవరు తిరగని చోట ఈ కొబ్బరి చిప్పను సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే మంచి జరుగుతుంది. అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు. ధనప్రాప్తి కలుగుతుంది. సుఖసంతోషాలు ఉంటాయి.
పిండి దీపాలు:
కార్తీకమాసంలో పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు. పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి, ఆవు పాలు వేసి పిండిని ముద్ద చేయాలి. ఆ తర్వాత ప్రమిద కింద చేసి, అందులో నెయ్యి, వత్తులు వేసి వెలిగించాలి. ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మంచిది.
365 వత్తులతో దీపం:
కార్తీక మాసంలో 365 వత్తులతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది. ఏడాది అంతా దీపం పెట్టకుండా ఉన్న వారు కూడా కార్తీకమాసంలో 365 ఒత్తులు వెలిగిస్తే, 365 రోజులు దీపం పెట్టిన ఫలితం కలుగుతుంది. శివాలయంలో కూడా 365 వత్తులతో దీపం వెలిగించవచ్చు.
ఉసిరి దీపం:
తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని పెడితే మంచి ఫలితం ఉంటుంది. శివాలయంలో నందీశ్వరుడు దగ్గర కూడా ఇదే దీపం పెట్టవచ్చు.