ఆగస్టు నెలలో ఈ ఐదు రాశులకు విపరీతమైన అదృష్టం.. అన్నిట్లో విజయాలు, వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలు!

గ్రహాలు సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందితే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి నెలలో కూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. అయితే, ఆగస్టు నెల కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. 

Published on: Jul 16, 2025 4:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. గ్రహాలు ఇలా సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందితే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి నెలలోకూడా కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది.

ఆగస్టు నెలలో ఈ ఐదు రాశులకు విపరీతమైన అదృష్టం (pinterest)
ఆగస్టు నెలలో ఈ ఐదు రాశులకు విపరీతమైన అదృష్టం (pinterest)

అయితే, ఆగస్టు నెలకొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఆగస్టు నెలలో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆగస్టు నెలలో గ్రహాల మార్పు:

ఆగస్టు నెలలో బుధుడు తిరోగమనం చెందుతాడు. అలాగే, కుజుడు కూడా తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ముఖ్యమైన గ్రహాల మార్పులు అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే, కొన్ని రాశులవారు మాత్రం శుభ ఫలితాలను పొందుతారు.

1.మేష రాశి

మేష రాశి వారికి ఆగస్టు నెల బావుంటుంది. ఈ నెలలో ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వారు అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విజయాలను అందుకుంటారు.

2.సింహ రాశి

సింహ రాశి వారికి కూడా ఆగస్టు నెల కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆటంకాలు అన్ని తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నిట్లో విజయాలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు కూడా వారి వద్ద ఉంటుంది.

3.తులా రాశి

తులా రాశివారికి ఈ సమయం బాగుంటుంది. ఆగస్టు నెల ఈ రాశి వారు అదనపు లాభాలను పొందుతారు. ఉత్తమ సమయం. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

4.కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి గురువు అనుగ్రహంతో ఆర్థిక లాభాలు అందుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. ఆశించిన దానికంటే ఈ నెల ఎక్కువ లాభాలు ఉంటాయి.

5.ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి కెరియర్ బాగుంటుంది. శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. అన్నిట్లో విజయాలను అందుకుంటారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.