ఈ రాశుల అమ్మాయిలను పెళ్ళి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి.. భర్తను అమితంగా ప్రేమిస్తారు, నిత్యం సంతోషాలు!

ఈ రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది. ఈ రాశుల అమ్మాయిలు ప్రతీ దానిలో కూడా పర్ఫెక్ట్‌గా ఉంటారు. భార్యలో ఉండాల్సిన గుణాలన్నీ కూడా ఈ రాశుల అమ్మాయిలలో ఉంటాయి. మరి ఏ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు? ఏ రాశుల అమ్మాయిలు అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉంటారో తెలుసుకుందాం.

Published on: Jul 17, 2025 9:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవృత్తి ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. అలాగే రాశుల ఆధారంగా వారి మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. ఈ రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది.

ఈ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు (pinterest)
ఈ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు (pinterest)

ఎందుకంటే ఈ రాశుల అమ్మాయిలు ప్రతీ దానిలో కూడా పర్ఫెక్ట్‌గా ఉంటారు. భార్యలో ఉండాల్సిన గుణాలన్నీ కూడా ఈ రాశులఅమ్మాయిలలో ఉంటాయి. మరి ఏ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు? ఏ రాశుల అమ్మాయిలు అన్నిట్లో పర్ఫెక్ట్‌గా ఉంటారు? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టాన్ని తెస్తారు, కుటుంబం హ్యాపీగా ఉంటుంది:

1.వృషభ రాశి

వృషభ రాశి అమ్మాయిలు విధేయతను కలిగి ఉంటారు. మీరు నమ్మకమైన జీవిత భాగస్వామి అవుతారు. కుటుంబానికి సంతోషాలను తీసుకువస్తారు. వైవాహిక జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, భర్తను బాగా అర్థం చేసుకుంటారు. ఏదైనా సమస్యలో వారు ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తారు. భర్తను అర్థం చేసుకుని బాగా చూసుకుంటారు.

2.కర్కాటక రాశి

ఈ రాశి అమ్మాయిలు ఎల్లప్పుడూ భర్తను ప్రేమిస్తారు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. కుటుంబంగురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల దయతో ఉంటారు. కుటుంబానికి ఎక్కువ విలువ ఇచ్చి, గొడవలు లేకుండా సంతోషంగా ఉండేటట్టు చూస్తారు.

3.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి అమ్మాయిలు ఎమోషన్స్‌కి ఎక్కువ విలువ ఇస్తారు. విశ్వాసంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అందరూ సంతోషంగా ఉండేలా చూసుకుంటారు.

4.కన్యా రాశి

కన్యా రాశి అమ్మాయిలు ఇంటిని శుభ్రంగా ఉంచుతారు. పద్ధతిగా నడుచుకుంటారు. కన్యా రాశికి చెందిన అమ్మాయిలు అన్ని విషయాల్లో కచ్చితంగా పాటిస్తారు. కన్య రాశిఅమ్మాయిలు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో, ఆ ఇల్లు అంతా కూడా సంతోషంతో నిండి ఉంటుంది.

5.మీన రాశి

మీన రాశి అమ్మాయిలు సానుభూతితో ఉంటారు. సహనం, అంకిత భావం కలిగి ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు కుటుంబంలో ప్రశాంతత ఉండేటట్టు చూస్తారు. మీన రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది రాదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More