ఈ నాలుగు రాశుల వారు నొప్పిని శక్తిగా మార్చుకుంటారు, అందుకే త్వరగా సక్సెస్ అవుతారు!

రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడమే కాకుండా, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదీ చెప్పవచ్చు. అయితే ఒక్కో రాశి వారి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. కానీ ఈ రాశుల వారు మాత్రం నొప్పిని కూడా శక్తిగా మార్చుకుంటారు. మరి నొప్పిని శక్తిగా మార్చుకునే వారు ఎవరు? 

Published on: Jul 31, 2025, 13:30:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందనేది చెప్పడమే కాకుండా, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేదీ చెప్పవచ్చు. అయితే ఒక్కో రాశి వారి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాశులవారు అందరితో సులువుగా కలిసిపోతారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని రాశుల వారు చాలా సైలెంట్‌గా ఉంటారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు.

నొప్పిని కూడా శక్తిగా మార్చుకునే రాశులు (pinterest)
నొప్పిని కూడా శక్తిగా మార్చుకునే రాశులు (pinterest)

అదే విధంగా కొన్ని రాశుల వారు చాలా ధైర్యంగా ఉంటారు. విజయాలను అందుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొంతమంది పెద్దగా కష్టపడరు, అంత ఈజీగా సక్సెస్ కూడా రాదు. కానీ ఈ రాశుల వారు మాత్రం నొప్పిని కూడా శక్తిగా మార్చుకుంటారు. మరి నొప్పిని శక్తిగా మార్చుకునే వారు ఎవరు? ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి.

నొప్పిని కూడా శక్తిగా మార్చుకునే రాశులు

1.వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారు నొప్పిని తేలికగా తీసుకోరు. అందులో లోతుగా మునిగిపోతారు. అది కేవలం బాధలోనే కాదు — ఆ బాధ నుంచి బయటకు రావడానికి, అలాగే దానిని శక్తిగా మార్చుకుని అనుకున్న వాటిని సాధించడానికి ముందుకు వెళ్తారు. వారికి తగిలే ప్రతి గాయం, వారు నేర్చుకునే ప్రతి పాఠం ద్వారా అనేక విషయాలను తెలుసుకుని శక్తివంతంగా మారుతారు. వారి బాధలను అన్నింటినీ గెలుపుకు దారిలా మార్చుకుంటారు.

2.మకర రాశి

మకర రాశి వారికి గాయాలు, బాధలు ఇవన్నీ కూడా జీవితంలో ఒక భాగమని తెలుసు. మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారు ఎంతో కష్టపడతారు. కష్టపడితే తప్ప విజయాన్ని చేరుకోలేమని వీరికి బాగా తెలుసు. ప్రతి ఓటమి కూడా కొత్త విషయాలను నేర్పుతుందని, వాటి ద్వారా శక్తిని పొందుతారు. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే, దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని విజయాలను చేరుకుంటారు.

3.మేష రాశి

మేష రాశివారు కూడా బాధను శక్తిగా మార్చుకుంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఎప్పుడైనా ఓటమి ఎదురైతే, అందులోనే బాధపడుతూ కూర్చోరు. ఆ బాధను మోటివేషన్‌గా మార్చుకుని, కష్టాలను దాటేస్తారు. వారి ఓటమి, తదుపరి యుద్ధానికి సిద్ధం చేస్తుంది.

4.సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు క్రియేటివిటీతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. బాధను కూడా లాభంగా మార్చుకుంటారు. వీళ్ళు ఇతరులకి ఆశాకిరణాలుగా మారతారు. ఓటమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని అనుకున్న వాటిని పూర్తి చేస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More