ఈ నాలుగు రాశులకు నరదిష్టి ఎక్కువగా తగులుతుంది.. జాగ్రత్త సుమా!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దాంతో జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. దురదృష్టం, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అనేది తెలుసుకుందాం.
రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడమే కాకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు. ఒక్కో రాశి వారి స్వభావం, తీరు ఒక విధంగా ఉంటుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దాంతో జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. దురదృష్టం, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి ఏ రాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది:
1.తులా రాశి
తులారాశి వారు ఆకర్షణగా కనిపిస్తారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. బహుముఖ ప్రతిభ కారణంగా ప్రతికూల శక్తుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటివి కలగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు సాహసవంతులు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇది ఇతరులను ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ అసూయకి దారి తీస్తుంది. అందువల్ల సింహ రాశి వారు నరదృష్టికి ఎక్కువగా గురవుతారు.
3.మిధున రాశి
మిధునరాశి వారు చాలా చురుకుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కొందరిలో అసూయను కలిగిస్తుంది. నరదృష్టి తగలకుండా ఉండాలంటే పసుపు రంగు బ్యాండ్ గాని, గొలుసు గాని వేసుకోవడం మంచిది.
4.కర్కాటక రాశి
కర్కాటకరాశి వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్లు ప్రతిదానినీ జాగ్రత్తగా గమనిస్తారు. ఇది ఇతరులకు అసూయ కలిగించేలా చేస్తుంది. దీని వల్ల ఈ రాశి వారు నరదృష్టికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



