గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, కేతువును నీడ గ్రహంగా భావిస్తారు. కేతువు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు.

ఏప్రిల్ 22న కేతువు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కేతువు మఖ నక్షత్రంలోకి అడుగు పెడతాడు. ఈ ప్రవేశంతో కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగవచ్చు. మానసికంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంది.
మఖా నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశుల వారికి సమస్యలు
కేతువు మఖా నక్షత్రంలోకి ఏప్రిల్ 22న అడుగుపెడతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సమస్యలు కలగవచ్చు. ప్రతికూల ప్రభావంతో బాధపడాల్సి ఉంటుంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి
మేషరాశి వారికి కేతువు నక్షత్ర సంచారం అశుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పనిలో ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా సమస్యలు రావచ్చు. అపార్థాలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా నష్టాలు కలగవచ్చు.
మిథున రాశి
మిథున రాశి వారికి కూడా కేతువు నక్షత్ర సంచారం అశుభ ఫలితాలను తీసుకురావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు సమస్యలను ఎదుర్కొంటారు. తోబుట్టువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ధైర్యం కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ సమయంలో గొడవలు, చికాకులతో బాధపడాల్సి ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి కూడా కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి రాదు. జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులతో సమస్యలు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తులతో సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}కన్య రాశి వారికి కూడా కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి రాదు. జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులతో సమస్యలు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తులతో సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి కూడా కేతువు నక్షత్ర సంచారంతో ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సహనంతో వ్యవహరించాలి. వాదనలు, తగాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి వారికి కూడా సమస్యలు రావచ్చు. మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన సమస్యలకు దూరంగా ఉండండి. ఆర్థికపరంగా కూడా నష్టాలు కలగవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక నష్టంతో బాధపడాల్సి ఉంటుంది.