మరి కొన్ని రోజుల్లో కేతువు కారణంగా ఈ రాశులకు అష్టకష్టాలు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!

ఏప్రిల్ 22న కేతువు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కేతువు మఖ నక్షత్రంలోకి అడుగు పెడతాడు. ఈ ప్రవేశంతో కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగవచ్చు. మానసికంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంది.

Published on: Mar 28, 2026 2:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అందరిపై ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, కేతువును నీడ గ్రహంగా భావిస్తారు. కేతువు కూడా కాలానుగుణంగా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు.

మరి కొన్ని రోజుల్లో కేతువు కారణంగా ఈ రాశులకు అష్టకష్టాలు (pinterest)
మరి కొన్ని రోజుల్లో కేతువు కారణంగా ఈ రాశులకు అష్టకష్టాలు (pinterest)

ఏప్రిల్ 22న కేతువు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కేతువు మఖ నక్షత్రంలోకి అడుగు పెడతాడు. ఈ ప్రవేశంతో కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగవచ్చు. మానసికంగా కూడా సమస్యలు కలిగే అవకాశం ఉంది.

మఖా నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశుల వారికి సమస్యలు

కేతువు మఖా నక్షత్రంలోకి ఏప్రిల్ 22న అడుగుపెడతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సమస్యలు కలగవచ్చు. ప్రతికూల ప్రభావంతో బాధపడాల్సి ఉంటుంది. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి

మేషరాశి వారికి కేతువు నక్షత్ర సంచారం అశుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పనిలో ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా సమస్యలు రావచ్చు. అపార్థాలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా నష్టాలు కలగవచ్చు.

మిథున రాశి

మిథున రాశి వారికి కూడా కేతువు నక్షత్ర సంచారం అశుభ ఫలితాలను తీసుకురావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు సమస్యలను ఎదుర్కొంటారు. తోబుట్టువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. ధైర్యం కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ సమయంలో గొడవలు, చికాకులతో బాధపడాల్సి ఉంటుంది.

కన్య రాశి

కన్య రాశి వారికి కూడా కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి రాదు. జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువులతో సమస్యలు రావచ్చు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తోటి ఉద్యోగస్తులతో సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కూడా కేతువు నక్షత్ర సంచారంతో ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సహనంతో వ్యవహరించాలి. వాదనలు, తగాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మీన రాశి

మీన రాశి వారికి కూడా సమస్యలు రావచ్చు. మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన సమస్యలకు దూరంగా ఉండండి. ఆర్థికపరంగా కూడా నష్టాలు కలగవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక నష్టంతో బాధపడాల్సి ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More