ఈ రాశుల అమ్మాయిలు భర్తకు లక్ష్మీదేవులు.. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ డబ్బు, సంతోషం ఉంటాయి!

ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే, అక్కడ దేనికి లోటు ఉండదని, సిరిసంపదలతో సంతోషంగా ఉండొచ్చని అంటారు. ఈ రాశుల అమ్మాయిలు భర్తకు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిలా ఉంటారు. భర్తకు ఏ లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు. మరి అదృష్ట రాశులు ఎవరు?

Published on: Oct 25, 2025, 15:00:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా చెప్పొచ్చు. రాశుల ఆధారంగా ఇలా చాలా తెలుసుకోవడానికి వీలవుతుంది. మన గురించి అనేక విషయాలను రాశుల ప్రకారం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే, అక్కడ దేనికి లోటు ఉండదని, సిరిసంపదలతో సంతోషంగా ఉండొచ్చని అంటారు.

ఈ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టం తీసుకువస్తారు (pinterest)
ఈ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టం తీసుకువస్తారు (pinterest)

భర్తకు లక్ష్మీదేవి

ఈ రాశుల అమ్మాయిలు భర్తకు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిలా ఉంటారు. భర్తకు ఏ లోటు ఉండదు, సంతోషంగా ఉంటారు. మరి అదృష్ట రాశులు ఎవరు? భర్తకు అదృష్టాన్ని తీసుకు వచ్చే ఆ రాశుల అమ్మాయిలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ రాశుల అమ్మాయిలు భర్తకు అదృష్టం తీసుకువస్తారు, ఇంటికి లక్ష్మీదేవిలా వస్తారు

1.వృషభ రాశి

వృషభ రాశి అమ్మాయిలు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా ఆదా చేయాలి అనేది వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారు బాగా వంట కూడా చేస్తారు. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండేలా చూస్తారు. అనవసరమైన ఖర్చులతో డబ్బును వృథా చేయరు. భర్త వ్యాపారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లగలరు.

2.కర్కాటక రాశి

కర్కాటక రాశి భార్యలు కూడా లక్ష్మీదేవిలా భర్తకు ఎల్లవేళలా సుఖసంతోషాలను అందిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలను వారు అర్థం చేసుకోగలరు. సాంప్రదాయ వంటకాలను ఎంతో రుచిగా వండుతారు. సాంప్రదాయాన్ని కూడా పాటిస్తారు. భర్త బాధలో ఉన్నా కూడా వారి సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరిస్తారు.

3.కన్య రాశి

కన్య రాశి అమ్మాయిలు కూడా భర్తకు లక్ష్మీదేవిలా జీవితంలోకి వచ్చి జీవితాన్ని మారుస్తారు. బడ్జెట్ విషయంలో చాలా దృఢంగా ఉంటారు. ఇంటిని శుభ్రంగా ఉంచడం వీరికి బాగా తెలుసు. కుటుంబ సభ్యులందరూ పౌష్టికాహారం తీసుకునేలా చూస్తారు. ఎవరికీ ఏ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భర్త అనుకున్నది సాధించాలని వారికి తోడుగా, సపోర్ట్‌గా ఉంటారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఉంచడానికి నిరంతరం శ్రమిస్తారు.

4.తులా రాశి

తులా రాశి అమ్మాయిలు కుటుంబంలో ప్రశాంతతను అందిస్తారు. ఇంటిని ఎంతో అందంగా అలంకరిస్తారు. స్నేహితులతో పార్టీలను అద్భుతంగా నిర్వహిస్తారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూస్తారు. ఈ రాశి అమ్మాయిలు ఇంటికి అందం, ఐశ్వర్యం తీసుకువస్తారు.

5.మకర రాశి

మకర రాశి అమ్మాయిలు ఎంతో కష్టపడి పని చేస్తారు. ఆర్థికపరంగా సమస్యలు రాకుండా చూసుకుంటారు. పిల్లలకు కూడా విలువలను నేర్పిస్తారు. ఇంటిని, కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. కుటుంబానికి మంచి పేరు తీసుకువస్తారు. ఈ రాశి అమ్మాయిలు భర్తకు ఐశ్వర్యం, అదృష్టం కలిగిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More