రాత్రి వేళ ఈ తప్పులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు మరి జాగ్రత్త!
Night Vastu Tips : రాత్రిపూట మనం చేసే కొన్ని తప్పులు చాలా ప్రభావం చూపిస్తాయి. అవి చిన్న విషయాలే అనుకుంటాం. కానీ పెద్ద ప్రభావం చూపెడతాయి. అవేంటో చూడండి.
మనం రోజంతా కష్టపడి పనిచేసేది సుఖంగా ఉండటానికే. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కలహాలు లేదా మనశ్శాంతి కరువవ్వడం వంటివి జరుగుతుంటాయి. దీనికి కారణం మనకు తెలియకుండానే రాత్రి వేళల్లో మనం చేసే కొన్ని వాస్తు విరుద్ధమైన పనులు కూడా కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి సమయం అనేది విశ్రాంతికి మాత్రమే కాదు, ఇంట్లోని శక్తిని సమతుల్యం చేసే సమయం కూడా. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు రాత్రిపూట చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..

అపరిశుభ్రమైన వంటగది
చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత గిన్నెలను అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అపరిశుభ్రమైన వంటగది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఎంగిలి పాత్రలను రాత్రంతా అలాగే ఉంచడం వల్ల అన్నపూర్ణా దేవికి కోపం వస్తుందని అంటారు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని పెద్దలు చెబుతారు. పడుకునే ముందే వంటగదిని క్లీన్ చేసుకోవడం వల్ల సానుకూలత పెరుగుతుంది.
నగదు, బంగారం
రాత్రి పూట నగదును లేదా విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం లేదా అప్పుగా ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇది మీ ఇంటి నుంచి సంపద బయటకు వెళ్ళిపోవడానికి సంకేతంగా భావిస్తారు. అలాగే మీ లాకర్ లేదా అల్మారా ఎప్పుడూ నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి.
జుట్టు కత్తిరించడం లేదా గోర్లు తీయడం
సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం లేదా జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇల్లు ఊడ్చడం కూడా మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరై ఊడ్చినా, ఆ చెత్తను రాత్రిపూట బయట పారవేయకూడదు.
తల వద్ద పెట్టకూడని వస్తువులు
నిద్రపోయేటప్పుడు తల పక్కన నీళ్ల గ్లాసు, మొబైల్ ఫోన్లు, పుస్తకాలు లేదా పాత వార్తాపత్రికలు ఉంచుకోకూడదు. ఇవి మీ ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. రాహు-కేతువుల ప్రభావం పెరిగేలా చేస్తాయి. పడకగదిలో తల వైపున నీరు ఉంచడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుందని వాస్తు చెబుతోంది.
ఉప్పు, పాలు ఇవ్వడం
చీకటి పడిన తర్వాత పొరుగువారికి ఉప్పు, పాలు లేదా పెరుగు వంటివాటిని అప్పుగా ఇవ్వకూడదు. పాలు చంద్రునికి ప్రతీక, ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక. వీటిని రాత్రి వేళ ఇతరులకు ఇవ్వడం వల్ల మీ ఇంటి అదృష్టం తగ్గుతుందని నమ్ముతారు.
వాస్తు అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు. అది మన జీవనశైలిని క్రమబద్ధం చేసే ఒక మార్గం. పైన చెప్పిన చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొనడమే కాకుండా, ఆర్థిక వృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


