మూడు రాశులకు ఏలినాటి శని నడుస్తోంది, వీరికి ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలుసుకోండి!
శని న్యాయ దేవుడు. శనీశ్వరుడు ఏలినాటి శని అంటే అందరికీ భయం. అయితే ఆ వ్యక్తి మంచి పనులు చేసి, జాతకంలో శని స్థానం సరిగ్గా ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే ఆ మనిషి చెడు చేసి, జాతకంలో శని మంచి స్థానంలో లేకపోతే వినాశనం కలుగుతుంది. శని ఈ సమయంలో మీన రాశిలో ఉన్నాడు.
శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి. చాలామంది శని పేరు చెప్తేనే భయపడిపోతారు. శనిన్యాయ దేవుడు. శనీశ్వరుడు ఏలినాటి శని అంటే అందరికీ భయం. అయితే ఆ వ్యక్తి మంచి పనులు చేసి, జాతకంలో శని స్థానం సరిగ్గా ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే ఆ మనిషి చెడు చేసి, జాతకంలో శని మంచి స్థానంలో లేకపోతే వినాశనం కలుగుతుంది.

ఏలినాటి శని ప్రభావం ఏ రాశులపై ఉంది?
శని ఈ సమయంలో మీనరాశిలో ఉన్నాడు. మూడు రాశుల వారు ఏలినాటి శనిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారిపై శని కఠినమైన దృష్టిని కలిగి ఉంటాడు. ఈ వ్యక్తుల ప్రతిచర్యను గమనించి దానికి తగ్గట్టుగా ఫలితాలను ఇస్తాడు.
1.మేష రాశి:
మేష రాశి వారికి ఏలినాటి శని మార్చి 2025లో మొదలైంది. ఏడున్నర ఏళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది. మేష రాశి వారు ఈ సమయంలో శని మొదటి దశలో ఉన్నారు. 2027లో రెండవ దశ మొదలవుతుంది. 2032కి శని నుంచి బయటపడతారు.
2.కుంభ రాశి:
కుంభ రాశివారికి ఏలినాటి శని మూడవ దశలో ఉంది. ఈ రాశుల వారికి 2027తో పూర్తయిపోతుంది. కుంభరాశికి అధిపతి శని కావడం వలన ఈ రాశుల వారికి శని ప్రత్యేక అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
3.మీన రాశి:
మీన రాశి వారికి రెండవదశ నడుస్తోంది. ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, ప్రమాదాలు వంటివి చోటుచేసుకోవచ్చు. ఒత్తిడి వలన బంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. 2029 వరకు ఈ రాశి వారు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ సమయంలో ఇలా చేయడం మంచిది:
శనికి ఇష్టం లేని వాటిని ఈ సమయంలో ఈ రాశుల వారు చేయకుండా చూసుకోవాలి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు కూడా ఈ రాశుల వారు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఎప్పుడూ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. అనవసరంగా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. పేదవాళ్లను, వృద్ధులను, పారిశుద్ధ్య కార్మికులను, కార్మికులను, మహిళలను బాధపెట్టకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper













