వెంకటేశ్వర స్వామి వారి గురుంచి మీకు ఎంత వరకు తెలుసు?

ప్రశ్న: వెంకటేశ్వర స్వామిని ఏ కలియుగ అవతారంగా భావిస్తారు?
జవాబు: వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు.
ప్రశ్న: వెంకటేశ్వర స్వామి పదానికి అర్థం ఏంటి?
జవాబు: 'వేం' పాపాలు 'కట' తొలగించే 'ఈశ్వరుడు' దేవుడు - పాపాలను తొలగించే దేవుడు అని అర్థం.
ప్రశ్న: శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం ఏది?
జవాబు: శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం నారాయణవనం. ఇది తిరుపతికి సమీపంలో ఉంది.
ప్రశ్న: వెంకటేశ్వర స్వామి ఏ కొండపై కొలువై ఉన్నారు?
జవాబు: వెంకటేశ్వర స్వామి శేషాచలం (ఏడుకొండలపై) కొలువై ఉన్నారు.
ప్రశ్న: కలియుగంలో శ్రీనివాసుడు వివాహం కోసం కుబేరుడు దగ్గర తీసుకున్న అప్పు ఎంత?
జవాబు: కుబేరుడు దగ్గర శ్రీనివాసుడు వివాహం కోసం 14 లక్షల వరహాలు తీసుకున్నారు.
ప్రశ్న: తిరుమలలో జరిపే అతిపెద్ద ఉత్సవం ఏంటి?
జవాబు: తిరుమలలో జరిగే అతిపెద్ద ఉత్సవం బ్రహ్మోత్సవాలు.
ప్రశ్న: తిరుమల ఆలయానికి మరో పేరు ఏంటి?
జవాబు: ఆనంద నిలయం.
ప్రశ్న: తిరుమల క్షేత్రంలో ఉన్న పవిత్ర కోనేరు పేరు ఏంటి?
జవాబు: స్వామి పుష్కరిణి. వైకుంఠం నుంచి భూమికి తీసుకురాబడిన పవిత్రమైన తీర్థముగా భావిస్తారు.
ప్రశ్న: కలియుగంలో శ్రీనివాసుడు ఎవరి ఇంట్లో పెరిగాడు?
జవాబు: కలియుగంలో శ్రీనివాసుడు వకుళా మాత వద్ద పెరిగాడు. ఆమె పూర్వజన్మలో కృష్ణుడిని పెంచిన యశోదా అని పురాణాలు తెలుపుతున్నాయి.
ప్రశ్న: తిరుమల ఆలయం ఏ జిల్లాలో ఉంది?
జవాబు: తిరుమల ఆలయం చిత్తూరు జిల్లాలో ఉంది.
{{/usCountry}}జవాబు: తిరుమల ఆలయం చిత్తూరు జిల్లాలో ఉంది.
{{/usCountry}}ప్రశ్న: శ్రీవారి ప్రతిరోజు ఆరుసార్లు పూజలు నిర్వహించే సంప్రదాయాన్ని ఏమంటారు?
జవాబు: షట్కాల పూజ అని అంటారు.
ప్రశ్న: తిరుమలలోని ప్రధాన ఆలయాన్ని నిర్మించిన రాజు ఎవరు?
జవాబు: తిరుమలలోని ప్రధాన ఆలయాన్ని నిర్మించిన రాజు తొండమాన్ చక్రవర్తి.
ప్రశ్న: వెంకటేశ్వర స్వామి గడ్డంపై పచ్చ కర్పూరం రాయడానికి గల చారిత్రక కారణం ఏంటి?
జవాబు: అనంతాళ్వారు కొట్టినప్పుడు తగిలిన దెబ్బకు ఉపశమనంగా పచ్చ కర్పూరం రాస్తారు.
ప్రశ్న: ఆనంద నిలయం పై ఉన్న శ్రీవారి ప్రతిరూపాన్ని ఏమంటారు?
జవాబు: ఆనంద నిలయం పై ఉన్న శ్రీవారి ప్రతిరూపాన్ని విమాన వెంకటేశ్వరుడు అని అంటారు.
ప్రశ్న: స్వామివారికి నిత్యం జరిపే సుప్రభాత సేవను ఏ సమయంలో నిర్వహిస్తారు?
జవాబు: స్వామివారిని నిద్ర లేపడానికి తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవ జరుపుతారు.
ప్రశ్న: తిరుమల కొండపై ఉన్న శిలాతోరణం ఏ కాలానికి చెందినది?
జవాబు: తిరుమల కొండపై ఉన్న శ్రీవారి శిలాతోరణం 250 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ క్విజ్ ద్వారా తిరుమల శ్రీవారి క్షేత్రానికి సంబంధించిన పవిత్రమైన విశేషాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. గోవిందుని కృపాకటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్!
గమనిక: భక్తుల సౌకర్యార్థం తిరుమల సమాచారాన్ని నిరంతరం తెలుసుకోవడం వల్ల స్వామివారిపై భక్తి పెరగడమే కాకుండా మన సంప్రదాయాలపై అవగాహన కలుగుతుంది. ఓం నమో వేంకటేశాయ!