...
...
Next Story

ఈరోజు శుక్రవారం+అష్టమి.. ఈ ఒక్క మంత్రంతో అప్పులు బాధలు తీరిపోవచ్చు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు!

మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లయితే ఏ ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ప్రత్యేకంగా పూజించడం వల్ల ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. ఈరోజు శుక్రవారం, అష్టమి వచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది.

Published on: Jul 18, 2025, 09:00:13 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఎన్ని అనుకున్నా, ఏదో ఒక సమస్యతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎలాంటి సమస్యలు కలగకుండా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే, చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలంటే లక్ష్మీదేవిని పూజించాలి.

ఈరోజు శుక్రవారం+అష్టమి (pinterest)
ఈరోజు శుక్రవారం+అష్టమి (pinterest)

మన ఇంట లక్ష్మీదేవికొలువై ఉన్నట్లయితే ఏ ఇబ్బందులు రావు, సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ప్రత్యేకంగా పూజించడం వల్ల ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలో దాని గురించి ముందుగా తెలుసుకుందాం.

శుక్రవారం పూజా విధానం:

  • పూజకు ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
  • లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా, చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టి దీపం వెలిగించాలి.
  • లక్ష్మీదేవికి పూలు సమర్పించి, స్తోత్రాలు చదివి పెట్టాలి.
  • ప్రదక్షిణలు చేసి క్షమాపణ చెప్పుకోవాలి.
  • పూజచేసేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆవేశం, కోపం ఉండకుండా చూసుకోవాలి.
  • పూజ సమయంలో ఇతరులతో అనవసరంగా మాట్లాడడం మంచిది కాదు. శుక్రవారం సాయంత్రం కూడా లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

ఇక ఇది ఇలా ఉంటే, ఈ రోజు ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శుక్రవారం, పైగా అష్టమి వచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని ఇలాంటి రోజున ఇలా చేయడం మంచిది. ఈ శ్లోకాన్ని చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంకలిగి సంతోషంగా ఉండవచ్చు. సిరసంపదలు కూడా కలుగుతాయి.

శుక్రవారం+అష్టమి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇలా చేయండి

ఈరోజు శుక్రవారం, అష్టమివచ్చింది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అఖండ ధన సంపాదన కలిగి, సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో పేదరికం నుంచి కూడా బయటపడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి.

లక్ష్మీ కాలభైరవ మంత్రం: ఓం నమో కాలభైరవాయ ధనం దేహి సంపత్ దేహి యశో దేహి శ్రీమ్ హీమ్ క్లీం స్వాహా

తులసిమాలతో ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది. లక్ష్మీ కాలభైరవ మంత్రాన్ని జపిస్తే ఐశ్వర్యం, రక్షణ, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రోజున లక్ష్మీదేవిని, కాలభైరవుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks