...
...
Next Story

ఈరోజే గంగా దసరా.. ఈరోజు ఈ 4 పనులు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి!

ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం దశమి నాడు గంగా దసరాను జరుపుకుంటాము. పాపాలను పోగొట్టే, మోక్షాన్ని అందించే దేవతగా గంగను భావిస్తారు. గంగ రోగాలను కూడా నయం చేస్తుందని నమ్ముతారు. ఈరోజు స్నాన, దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్నిటిని పాటించడం వలన కష్టాలు తొలగిపోతాయి.

Published on: Jun 5, 2025, 07:00:12 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

హిందూమతంలో గంగా దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం దశమి నాడు గంగా దసరాను జరుపుకుంటాము. ఈరోజు గంగ మాత స్వర్గం నుంచి భూమికి అవతరించిందని అంటారు. పాపాలను పోగొట్టే, మోక్షాన్ని అందించే దేవతగా గంగను భావిస్తారు. గంగరోగాలను కూడా నయం చేస్తుందని నమ్ముతారు.

గంగా దసరా ఎప్పుడు వచ్చింది?

ఈరోజే గంగా దసరా (pinterest)
ఈరోజే గంగా దసరా (pinterest)

ఈ సంవత్సరం గంగా దసరా జూన్ 5, గురువారంనాడు వచ్చింది. ఈరోజు స్నాన, దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్నిటిని పాటించడం వలన కష్టాలు తొలగిపోతాయి, పుణ్యం లభిస్తుంది. రాత్రిపూట కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది.

ఈసారి గంగా దసరా రోజు ఏం చేయాలి?, ఎటువంటి వాటిని పాటిస్తే మంచి జరుగుతుంది అంటే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గంగా దసరా నాడు విశేష ఫలితాలను పొందాలంటే ఇలా చేయండి:

1. గంగాజలంతో దీపారాధన:

గంగా దసరా నాడు గంగాజలంతో దీపాన్ని వెలిగిస్తే మంచిది. రాత్రి తులసిమొక్క దగ్గర గంగాజలంలో స్వచ్ఛమైన నెయ్యి కలిపి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని పాటించడం వలన ఇంట్లో సానుకూల మార్పులు వస్తాయి. ఆనందం, శాంతి కలుగుతాయి.

2. గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయండి:

గంగా దసరా నాడు గంగాజలాన్ని ఇంట్లోచల్లండి. ఇలా చేయడం వలన నెగటివ్ శక్తి తొలగిపోతుంది. ముఖ్యంగా ఇంటి ముఖద్వారం, పూజ గది, వంటింట్లో గంగాజలాన్ని చల్లాలి. ఇది సానుకూల శక్తిని తీసుకురాగలదు, ప్రతికూల శక్తిని తొలగించగలదు. పేదరికం కూడా తొలగిపోతుంది.

3. గంగా స్తోత్రం లేదా హారతి:

కుదిరితే గంగా నది ఒడ్డున దీపారాధనచేయడం మంచిది. నువ్వుల నూనె లేదా నెయ్యితో ఆరాధన చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. కష్టాల నుంచి బయటపడొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks