ఈరోజే ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి.. ఇలా చేస్తే సకల పాపలు తొలగిపోతాయి, విష్ణువు అనుగ్రహం కూడా ఉంటుంది!

తొలి ఏకాదశి నాడు మహావిష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. విష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి తొలి ఏకాదశి శక్తివంతమైన రోజు. తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి, తొలి ఏకాదశి నాడు ఎటువంటి వాటిని ఆచరించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు, పూజ చేయడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి?

Published on: Jul 6, 2025, 07:00:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూలై 6న ఆషాఢ మాసంలో వచ్చే మొదట ఏకాదశి అయినటువంటి తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశి నాడు మహావిష్ణువును ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. విష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి తొలి ఏకాదశి శక్తివంతమైన రోజు. తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి, తొలి ఏకాదశి నాడు ఎటువంటి వాటిని ఆచరించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు, పూజ చేయడం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజే ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి (pinterest)
ఈరోజే ఎంతో శక్తివంతమైన తొలి ఏకాదశి (pinterest)

తొలి ఏకాదశి పూజ చేయడం వలన ఎన్ని లాభాలను పొందవచ్చు?

తొలి ఏకాదశినాడు విష్ణువును ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీర, మానసిక శాంతిని పొందవచ్చు. ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. కుటుంబం సుఖంగా ఉంటుంది. సంపదలను ఆకర్షించవచ్చు.

తొలి ఏకాదశి పూజ ప్రాముఖ్యత

  1. తొలి ఏకాదశి నాడు శుభ్రంగా స్నానం చేసి, ఉతికిన దుస్తులను ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి దీపారాధన చేయాలి.
  2. పంచామృతాలతో మహావిష్ణువుకి అభిషేకం చేయాలి.
  3. ఈరోజు విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పిస్తే మంచిది.
  4. "ఓం నమో నారాయణ" అనే మంత్రాన్ని జపిస్తే, విష్ణువు అనుగ్రహం కలిగి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి.
  5. ఈరోజు విష్ణు సహస్రనామ పఠనం చేస్తే కూడా మంచి జరుగుతుంది.
  6. తొలి ఏకాదశి నాడు ఉపవాసం, జాగరణతో కూడా మంచి జరుగుతుందట. చాలామంది భక్తులు తొలి ఏకాదశి నాడు కీర్తనలు పాడుతూ జాగరణ చేస్తారు. అలా చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది.

తొలి ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది? ఈరోజు ఇలా చేస్తే సకల సంపదలు

తొలి ఏకాదశి నుంచే పండుగలుఅన్ని మొదలవుతాయి. అందుకనే దీనిని తొలి ఏకాదశి అని, తొలి పండుగ అని అంటారు. దీనినే "శయన ఏకాదశి" అని కూడా అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఇది మొదటిది. విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక కలగాలంటే ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తిని పూజించిన తర్వాత పాలు, పండ్లు వంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి.

ఉపవాస దీక్షను ద్వాదశి రోజు విరమించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండేది ఆదర్శం. తర్వాత ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేయడాన్నే తొలి ఏకాదశి వ్రతం అని అంటారు. ఈ వ్రతం చేయడం వలన కుచేలుడికి దరిద్రం తొలగిపోయి సకల సంపదలు కలిగాయని పురాణాల్లో చెప్పబడింది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More