ఈరోజు మహా సంయోగం.. సిద్ధయోగం+స్వాతి నక్షత్రం.. ఈ మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టం, పట్టిందల్లా బంగారమే!

సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం కారణంగా రెండు యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడంతో, కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది. ఈరోజు కొత్త ప్రణాళికలు వేయాలన్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, ఆస్తులను కొనుగోలు చేయాలన్నా మంచిది. ముఖ్యంగా, ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Published on: Jul 5, 2025, 09:01:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈరోజు జూలై 5న కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఈరోజు రెండు శుభయోగాలు ఏర్పడ్డాయి. సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం కారణంగా రెండు యాదృచ్ఛికాలు చోటు చేసుకోవడంతో, కొన్ని రాశుల వారికి ఊహించనిలాభాలను తీసుకువస్తుంది.

సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం (pinterest)
సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం (pinterest)

ఈరోజుకొత్త ప్రణాళికలు వేయాలన్నా, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, ఆస్తులను కొనుగోలు చేయాలన్నా, వాహనాలను కొనుగోలు చేయాలన్నా, కొత్త కళ నేర్చుకోవాలన్నా ఈ రోజు మొదలు పెడితే మంచిది. ఇది కేవలం ఈరోజుకే కాదు, కొన్ని రోజులు వరకు శుభ ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ రాశుల వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది.

సిద్ధ యోగం

ఈరోజు ఈ యోగం కారణంగా కొత్త పనులు ప్రారంభించడానికి శుభ సమయం, ఈ యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. రాత్రి 8:05 వరకు ఇది ఉంటుంది.

స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రం కూడా ఈ ప్రత్యేకమైన రోజున ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనది. స్వాతి నక్షత్రందాతృత్వం, తెలివితేటలు, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ప్రశాంతమైన, ఆకట్టుకునే స్వభావం కలిగి ఉంటారు.

ఈ మూడు రాశులకు లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. సిద్ధ యోగం పురోగతిని తీసుకువస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఈరోజు ఊపందుకుంటాయి. కెరీర్‌కి సంబంధించిన కొత్త ప్రణాళికలు వేస్తారు. కొత్త దిశలో అడుగు వేయాలని అనుకుంటే, ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఉపశమనం కలుగుతుంది.

2.మిథున రాశి

మిథున రాశివారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సిద్ధ యోగం, స్వాతి నక్షత్రం ఆర్థిక ప్రయోజనాలను తీసుకువస్తుంది. పాత పనులు పూర్తవుతాయి, సక్సెస్‌ను ఇస్తాయి. కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు. జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

3.సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఈ రెండు యోగాల వలన ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టడానికి ఈ రోజు బాగుంటుంది. ఇప్పటి వరకు పూర్తి కాని పనులు ఈరోజు పూర్తవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, గౌరవం పెరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More