ఈరోజు ఆశ్లేష నక్షత్రంలోకి బుధుడు.. ఐదు రాశులకు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవ్వడంతో పాటు డబ్బు, ప్రమోషన్లు ఇలా ఎన్నో!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఈరోజు నక్షత్రం మార్చాడు. జూలై 7 సోమవారం ఉదయం 5:55 గంటలకు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీంతో బుధుని నక్షత్ర మార్పు 5 రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మరి బుధుని నక్షత్ర మార్పు ఏయే రాశులకు కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చో తెలుసుకుందాం.

Published on: Jul 7, 2025, 12:00:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు బుద్ధి, వాక్కు, తర్కం, గణితం, వ్యాపారానికి కారకుడు. బుధుని గ్రహాల యువరాజు అని అంటారు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే వ్యక్తి తీక్షణ బుద్ధి, తెలివిగా ఉంటాడు. బలహీనంగా ఉన్నట్లయితే లోపాలు తలెత్తుతాయి.

బుధుని నక్షత్ర మార్పుతో ఐదు రాశుల వారికి బోలెడు లాభాలు
బుధుని నక్షత్ర మార్పుతో ఐదు రాశుల వారికి బోలెడు లాభాలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడుఈరోజు నక్షత్రం మార్చాడు. జూలై 7 సోమవారం ఉదయం 5:55 గంటలకు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీంతో బుధుని నక్షత్ర మార్పు 5 రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.

బుధుని నక్షత్ర మార్పుతో ఐదు రాశుల వారికి బోలెడు లాభాలు:

1.మిథున రాశి:

మిథునరాశి వారికి బుధుని నక్షత్ర మార్పు శుభ ఫలితాలను తీసుకు వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం.

2.కన్య రాశి:

కన్య రాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. బుధుని నక్షత్ర మార్పు అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్లను పొందే అవకాశం ఉంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

3.కర్కాటక రాశి:

ఆశ్లేష నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడంతో ఈ రాశివారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. పూర్వీకుల ఆస్తులు లభించే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. సంతోషంగా ఉండచ్చు.

4.తుల రాశి:

తులారాశి వారికి బుధుని నక్షత్ర మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. పాత పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. తెలివైన వారు చెప్పే సలహాలను పాటిస్తే మంచిది.

5.మీన రాశి:

మీన రాశి వారికి బుధుని నక్షత్ర మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పరిశోధన, రైటింగ్, క్రియేటివ్ వర్క్స్ చేసే వారికి ఈ సమయంలో సక్సెస్‌ను అందుకుంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More