నేటి రాశి ఫలాలు జూలై 11, 2025: ఈరోజు ఈ రాశి వారికి వాహనయోగం.. గులాబీ, నీలం అదృష్ట రంగులు, విష్ణు సహస్రనామ పారాయణ మంచిది!
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 11.07.2025 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 11.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : శుక్రవారం, తిథి : కృ. పాడ్యమి, నక్షత్రం : పూర్వాషాడ
మేష రాశి
మేషరాశి వారు కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. విద్యార్థులకు శుభవార్తలు, వాహనాలు, భూముల కొనుగోలు, ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, గణేశ్తోత్రాలు పఠించండి.
వృషభ రాశి
వృషభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. ధనప్రాప్తి, స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపార లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు. అనారోగ్యం. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు. ఆకుపచ్చ, నీలం రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మిథున రాశి
మిథున రాశి వారు ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు, ఆర్థిక పరిస్థితి, బంధువులతో విరోధాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం, వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో ఎదురుచూడని మార్పులు సంభవం. కళారంగం వారికి ప్రోత్సాహం అంతగా కనిపించదు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు, హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
సింహ రాశి
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వాహనయోగం కలుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వ్యయ ప్రయాసలు, బంధు విరోధాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు, శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి.
కన్య రాశి
కన్యరాశి వారు అనుకున్న పనులు కొంత జాప్యం అయినా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు. ఎవరు అడ్డగించినా లెక్కచేయరు. పూర్వపు సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. వారం చివరిలో ధన వ్యయం, ఆరోగ్య భంగం. గులాబీ, పసుపు రంగులు, పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.
తులా రాశి
తులారాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. అనారోగ్యం, శ్రమ, బంధు విరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు, శివపంచాక్షరి పఠించండి.
వృశ్చిక రాశి
ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది. విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వాహనాలు, భూముల కొనుగోలు, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ధన వ్యయం, అనారోగ్యం, శ్రమ పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు విజయాలు సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ధన వ్యయం, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
మకర రాశి
మకరరాశి వారు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక సమాచారంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం లభిస్తుంది. ఆరోగ్య భంగం, శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు, దేవీ స్తోత్రాలు పఠించండి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఆలోచనలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. నూతన విద్యావకాశాలు, వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. పారిశ్రామిక వర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనారోగ్యం, మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు, నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీన రాశి
ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. నేర్పు, ఓర్పుతో జటిలమైన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ధన వ్యయం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, నృసింహ స్తోత్రాలు పఠించండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000














