నేటి రాశి ఫలాలు జూలై 13, 2025: ఈరోజు ఈ రాశి వారు ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.. బంగారు, తెలుపు అదృష్ట రంగులు!
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 13.07.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
హిందుస్తాన్ టైమ్స్
రాశిఫలాలు (దిన ఫలాలు) : 13.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: ఆషాడ, వారం : ఆదివారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : శ్రవణ
మేష రాశి
మేష రాశి వారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తాయి. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. ధనవ్యయం, కుటుంబంలో చికాకులు. నలువు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.
వృషభ రాశి
వృషభరాశి వారికి పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేకున్నా కొన్ని మార్పులు తప్పవు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ధనవ్యయం, ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. దుర్గాదేవిని ఆరాధించండి.
మిథున రాశి
మిథునరాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయం కాగలరు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు అనుకోని పిలుపు రావచ్చు. ధనవ్యయం, ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారు కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. వాహన యోగం. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామిక వర్గాలకు అన్నింటా అనుకూలమే. అనారోగ్యం, కుటుంబ సభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణు ధ్యానం చేయండి.
సింహ రాశి
సింహ రాశి బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మానసిక అశాంతి, అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కన్య రాశి
కన్యరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. గృహనిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్ప లాభాలు ఆర్జిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామిక వర్గాలకు లేనిపోని చిక్కులు. శుభవార్తలు, వాహనయోగం. గులాబీ, ఎరుపు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.
తుల రాశి
ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం, విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ఊపిరి పీల్చుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఊహించని అవకాశాలు. అనారోగ్యం, కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. దేవీ ఖడ్గమాల పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారు అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు శ్రమకు తగ్గ ఫలితం. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి. వ్యయప్రయాసలు. గులాబీ, నీలం రంగులు. లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు రాశి
నేర్పుగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల హడావిడి. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే సమయం. కళారంగం వారికి అవకాశాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
మకర రాశి
మకరరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాలకు మరింత అనుకూల సమయం. ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
కుంభ రాశి
కొన్ని ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలై ఆర్థికంగా బలపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయ వర్గాలకు మరింత సానుకూలం. ధనవ్యయం, కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. వినాయక స్తోత్రాలు పఠించండి.
మీన రాశి
మీన రాశి వారు ప్రారంభంలో కొన్ని సమస్యలు, వివాదాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారి సేవలకు గుర్తింపు. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000


E-Paper












