...
...
Next Story

నేటి రాశి ఫలాలు జూలై 15, 2025: ఈరోజు ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి, వేంకటేశ్వర స్వామిని పూజించండి!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 15.07.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 15, 2025, 04:00:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 15.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : కృ. పంచమి, నక్షత్రం : శతభిష

మేష రాశి

మేష రాశివారికి అత్యుత్తమ సమయం. ఆశయం నెరవేరుతుంది. కాలం కలిసొస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతిభను కనబరుస్తారు. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను కురిపిస్తాయి. ఏలినాటి శని ప్రభావం ఉంది, కాబట్టి ఆచితూచి అడుగేయాలి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల భాగస్వామ్యం అవసరం. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి.

వృషభ రాశి

అదృష్టయోగం కొనసాగుతోంది. శుభాలు జరుగుతాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. సున్నితంగా సంభాషించండి. ఆరంభశూరత్వం పనికిరాదు. మహాలక్ష్మిని ధ్యానించండి.

మిథున రాశి

మిథునరాశి వారికి వ్యాపారయోగం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ పరిధి విస్తరిస్తుంది. ధనస్థానంలో ఉన్న బుధయోగం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అధిక వ్యయాలు కూడా సూచితం. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. జాగ్రత్తగా మెలగండి. నలుగురికీ చేతనైనంత సాయం చేస్తారు. సూర్యభగవానుడిని ఆరాధించండి.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి శుక్రయోగం లాభాలను ప్రసాదిస్తుంది. గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం. చిన్నపాటి విభేదాలతో చిరకాల స్నేహితులు దూరం కావచ్చు. కాలం మిశ్రమంగా ఉండటంవల్ల ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి.

సింహ రాశి

కన్యరాశి వారికి అత్యుత్తమ సమయం. విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో గణనీయమైన లాభాలను గడిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేసుకోవద్దు. అధికార లాభం సూచితం. మహాలక్ష్మిని ధ్యానించండి.

తుల రాశి

తులరాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ప్రయత్నాలు కలిసొస్తాయి. పదవీలాభం సూచితం. గతంలో ఆగిపోయిన పనుల్లో మళ్లీ కదలిక వస్తుంది. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థిక నష్టాలను అధిగమిస్తారు. భూ, గృహ, వాహనయోగాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు లాభదాయకం. పరిస్థితులను బట్టి నిర్ణయాలను సమీక్షించండి. లక్ష్మీనారాయణులను స్మరించండి.

వృశ్చిక రాశి

దైవశక్తి తోడుగా నిలుస్తుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. కాలం కొంత వ్యతిరేకంగా ఉంది, కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి వల్ల పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. వినయ విధేయతలు చాలా ముఖ్యం. నిందలు మోపేవారితో జాగ్రత్త. వ్యాపార వ్యవహారాల్లో ఇతరులపై ఆధారపడకండి. నవగ్రహ స్తోత్రాలను పఠించండి.

ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారు మనోబలంతో ముందుకు సాగండి. బలమైన ప్రయత్నంతో ఉన్నత విజయాలు సాధిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. ఇతరుల లోపాలను పెద్ద మనసుతో ఆమోదించండి. అపార్థాలు సృష్టించేవారితో జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశి

శుభప్రదమైన కాలం. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. ఆత్మబలంతో అవరోధాలను అధిగమిస్తారు. శత్రు దోషం తొలగుతుంది. మిత్రుల అండదండలు పెరుగుతాయి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కుంభ రాశి

కుంభరాశి వారికి వ్యాపారయోగం శుభప్రదం. ఉన్నత స్థితి గోచరిస్తోంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి ప్రోత్సాహం అందుతుంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండండి. చెడు ఆలోచనలు వద్దు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. సూర్యనారాయణుడిని స్మరించండి.

మీన రాశి

లక్ష్మీయోగం బలంగా ఉంది. ఆర్థిక విజయాలు సాధిస్తారు. వాయిదా మనస్తత్వం పనికిరాదు. ఉద్యోగంలో శుభఫలితాలు అందుకుంటారు. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. కొన్నిసార్లు ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది. అయినా నిరాశపడకండి. బలమైన ప్రణాళికతో సమస్యల నుంచి బయటపడతారు. పరమేశ్వరుడిని ధ్యానించండి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 9494981000

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe