నేటి రాశి ఫలాలు జూలై 17, 2025: ఈరోజు ఈ రాశి వారికి పట్టుదల అవసరం, నిరుద్యోగులకు అవకాశాలు!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 17.07.2025 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 17, 2025, 04:00:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 17.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : గురువారం, తిథి : కృ. సప్తమి, నక్షత్రం : రేవతి

మేష రాశి:

ఈ రాశివారికి ఈ రోజు గ్రహసంచారాలు మిశ్రమంగా ఉపకరిస్తాయి. కుటుంబంలో సామరస్యతలు కొనసాగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా అనుకూలతలు ఉంటాయి. సమాచారం ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు స్పష్టత ఉండేటట్లు జాగ్రత్త వహించండి. వృత్తి, ఉద్యోగాల పట్ల అంకితభావాలు అవసరమౌతాయి. మిత్ర, బంధువర్గపు సహకారాలు తీసుకోండి. సంతాన విషయంలో సర్దుకు పోవలసి రావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్లు పెట్టుకొని యత్నించుకోవాలి.

వృషభ రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఏకవాక్యతలతో అన్నింటా ఉత్సాహంగా సాగగలరు. అవసరాలను సమర్థించుకునేటట్లు ఆదాయాలు ఉంటాయి. మంచి ఆలోచనలను సకాలంలో చేయగలుగుతారు. ఉన్నత ఉద్యోగ, విద్యలకై చేసే యత్నాలు ఉపకరిస్తాయి. సంతానంలో ఒకరికి ఉద్యోగప్రాప్తి ఉంటుంది. స్థిరాస్తుల సేకరణలు ఉంటాయి.

మిథున రాశి:

మిథునరాశి వారికి ఈ రోజు దూకుడు స్వభావాలను తగ్గించి ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి. ఇరకాటంలో పెట్టాలనేవారు ఉంటారు, జాగ్రత్తలు పాటించుకోవాలి. కుటుంబ వ్యక్తుల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వండి. వృత్తి, ఉద్యోగ, ఆరోగ్యపరంగా బాగుంటుంది. చిన్న పనినైనా ప్రణాళికాయుతంగా సాగించాల్సి ఉంటుంది. చేపట్టిన ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగి ప్రయోజనాలను ఇస్తాయి.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు పుణ్యక్షేత్ర దర్శనాలకు, సద్గ్రంథ పఠనాలకు ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తిగత విమర్శలు చేయుటకు దూరంగా ఉండండి. ఆరోగ్య, ఆర్థిక విషయాలు అనుకూలం. భ్రాతృవర్గంతో వివాదాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో గతంలో రావలసినవి వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకోగలరు. విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి:

సింహరాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. అవసరాలను సమర్థించుకోగలరు. గత బకాయిలలో కొంత మొత్తాన్ని తీర్చగలుగుతారు. బంధు, మిత్ర వర్గంతో జాగ్రత్తలు తప్పనిసరి. మీ బలహీనతలను బంధువర్గంతో పంచుకోకండి. ఓర్పు, నేర్పులు అవసరం. నూతన తరహా పనులపై దృష్టి పెట్టగలుగుతారు. వాణిజ్య వ్యాపారాలలో లాభాలు పొందగలరు. ఆధ్యాత్మికతపై సమయ కేటాయింపులు చేస్తారు.

కన్య రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబంలో సర్దుకు పోవలసి వస్తుంది. చికాకులకు కుంగిపోకుండా ధైర్యంగా వ్యవహరించాలి. ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండండి. స్థిరమైన ఆలోచనలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా సాధారణ స్థితులు కొనసాగుతాయి. ఊహించిన పనులను వాయిదా వేయకండి. విద్యార్థులకు వ్యాసంగాలు అనుకూలం.

తుల రాశి:

తులరాశి వారికి ఈ రోజు లక్ష్యాలను సాధించుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. చర, స్థిరాస్తుల స్థిరీకరణకు మౌనం వహించగలరు. ప్రభుత్వతరహా పనులు చేపట్టి పూర్తిచేసుకోగలరు. వృత్తి, వ్యాపారాల్లో నూతన అవకాశాలను పొందగలరు. కుటుంబ వ్యక్తుల తీరు నచ్చకపోయినా సర్దుకు పోవాలి. రావలసిన పత్రాలు, నగదు రాబట్టుకోగలరు. ఉద్యోగాల రీత్యా అనుకూల సమయం. కోరుకున్న బాధ్యతలకు అవకాశాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి:

వృశ్చికరాశి వారికి ఈ రోజు కుటుంబంతో ఉత్సాహంగా వ్యవహరించగలరు. నూతన వస్తు సౌకర్యాలు ఏర్పరచుకుంటారు. వృత్తి, ఉద్యోగ విధినిర్వహణలో వాయిదాలను దూరంగా ఉంచాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కోర్టు లిటిగేషన్ వంటి పనులు నెమ్మదిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు.

ధనుస్సు రాశి:

ధనుస్సురాశి వారికి ఈ రోజు గ్రహస్థితిలో ప్రతికూల అంశాలు ఎక్కువ. అన్ని విషయాల్లో శ్రద్ధ, పట్టుదల అవసరం. కుటుంబంలో ఉత్సాహాలు క్రమంగా ఏర్పడతాయి. కొన్ని అంశాలు నిరాశకు గురిచేయగలవు. వస్తు జాగ్రత్తలు అవసరం. అవసరాలను సమర్థించుకోగలరు. అనవసర ఆలోచనల వల్ల సమయం, ఆదాయం, నష్టాలు ఎదురవుతాయి. స్నేహవర్గపు రాకపోకలు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు కలిసివస్తాయి.

మకర రాశి:

మకరరాశి వారికి ఈ రోజు ఆహార, విరామాలలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆలోచనలకు, అభిరుచులకు తగిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, పనిముట్లు మరమ్మతులు అవసరం కావచ్చు. వ్యక్తిగత ఆలోచనలు ఉపకరిస్తాయి. సంతానంలో ఒకరికి శుభములు ఏర్పడగలవు. వృత్తి, ఉద్యోగాలలో క్రమంగా అభివృద్ధి సాధించగలరు. ప్రభుత్వతరహా పనులు చేపట్టడానికి అనువైన సమయం.

కుంభ రాశి:

కుంభరాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో సంయమనం అవసరం. పెద్దల నుండి సహకారం పొందగలరు. అధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. వ్యాపార, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి ముందుకు వెళ్లండి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం, బాంధవ్యాలు క్రమంగా కుదుటపడతాయి. స్నేహవర్గంతో విభేదాలు రాకుండా చూడాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ రోజు పనులు నెమ్మదిగా సాగినా అనుకూలతలు సాధించగలరు. వ్యక్తిగత అభివృద్ధి సాధించగలరు. వాహన, యంత్రాల ఏర్పాట్లు జరుగుతాయి. తీర్థయాత్రలు చేసుకుంటారు. దూరప్రాంత ప్రయాణాలు చేయగలరు. వస్తువుల జాగ్రత్తలు అవసరం. వృత్తి, వ్యాపారాలలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. చెల్లింపులు పూర్తిచేసుకునేటట్లు ఆదాయాలు ఉంటాయి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More