నేటి రాశి ఫలాలు జూలై 08, 2025: ఈరోజు ఈ రాశి వారు అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి.. శివాలయ సందర్శన మంచిది!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 08.07.2025 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 08, 2025 4:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 08.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : మంగళవారం, తిథి : శు. త్రయోదశి, నక్షత్రం : జ్యేష్ఠ

మేష రాశి

మేషరాశి సంతానమునకు అభివృద్ధి, ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, పోటీలు అనుకూలం, పుణ్యాలను పెంచుకుంటారు. వృత్తి సంబంధమైన ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సంభాషిస్తారు. ఆహార నియమాలు పాటించాలి. సోదర వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి

వృషభరాశి వారు పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి. అసౌకర్యంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువ, రిపేర్ల కొరకు శ్రద్ధ. స్త్రీ సంతానం అభివృద్ధి. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్లలో ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు సహకారాన్ని కోరుకుంటారు.

ఉన్నత విద్య కొరకు విదేశీయానానికి శ్రమ చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి, నూతన పరిచయాలు, వ్యాపారం విస్తరణ. వీలైనంతవరకు స్త్రీలతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. మంచి ఫలితాల కొరకు శివాలయ సందర్శన మంచిది.

మిధున రాశి

మిధునరాశి వారు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఖర్చులు, వృత్తిపరమైన వ్యవహారాలు ఊహించని ఇబ్బందులను పెంచును. తలనొప్పి, కంటికి సంబంధించిన అనారోగ్యాలు నిర్లక్ష్యం చేయరాదు. దగ్గర ప్రయాణాలకు అవకాశం, ముఖ్య వ్యవహారాలలో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనానికి ఇబ్బందులు అధికం. వృత్తిపరంగా అవతలి వ్యక్తుల జోక్యం చికాకును సృష్టిస్తుంది. మరిన్ని మంచి ఫలితాలు. సత్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.

కర్కాటక రాశి

అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు, కుటుంబ వ్యవహారాల్లో చికాకులను పెంచుతాయి. వ్యాపార వ్యవహారములలో పొదుపు పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెంచుకుంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. స్త్రీల సహకారాన్ని పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుడి ఆరాధించండి.

సింహ రాశి

సింహరాశి వారు గమనించగా ఆరోగ్య విషయంలో ఖర్చులు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఖర్చులను కొంతమేర తగ్గించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో, ఆర్థిక విషయాలలో అనవసర వ్యక్తుల జోక్యాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ధైర్యంగా ముందుకు వెళతారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

కన్యా రాశి

కన్య రాశి వారు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక అప్పులు నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు. వృత్తిపరమైన ప్రయాణములు. జీవిత భాగస్వామితో, వారి యొక్క బంధువులతో మాట్లాడేప్పుడు నాయకత్వ లక్షణాలు, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారు. చిన్న చిన్న విషయాలకు కలహాలు, అపార్థాలు ఏర్పడే అవకాశం. ప్రయాణములు చేయునప్పుడు, ముఖ్యంగా డ్రైవింగ్ సందర్భాలలో ‘గరుడ వాహన’ శ్లోకాన్ని పఠించడం మంచిది. షాపింగులు, విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాల కొరకు దేవి శ్లోకాలు, అష్టోత్తరాలు, లలితా సహస్రనామ పారాయణ మేలు.

తులా రాశి

తులా రాశి వారు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. షాపింగులు మీద షాపింగులు చేస్తారు. ఖర్చులు ఆనందాన్ని ఇస్తాయి. గృహ, తల్లి, ఆరోగ్య, వ్యవసాయ సంబంధ అంశాలు అసౌకర్యం కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంపై శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు విద్యపై దృష్టి పెడతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారు వాహన కొనుగోలు విషయాల్లో అసౌకర్యంగా ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. రవి ప్రభావం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధిత పనుల్లో సాధారణ ఫలితాలు. ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయాణాలకు కొంత అవకాశాలు. ఆర్థిక పరంగా విదేశాల్లో ఉండే తోబుట్టువులు, స్నేహితుల సహకారం అందుకుంటారు. విద్యార్థులు విద్యాసంబంధమైన విషయాలపై దృష్టి సారించాలి. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది.

ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారు వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు అవకాశం. బాధ్యతలు పెరుగుతాయి. గృహావరణంలో, కుటుంబ సభ్యులతో ఆర్థిక అంశాలలో తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి. ఎంతగానో ఎదురు చూస్తున్న విషయాల్లో దూర ప్రదేశం నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తడి, బంధువర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చులు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర సమస్యలకు దూరంగా ఉండాలి.

మకర రాశి

మకరరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు. ఆరోగ్య విషయంలో, ప్రయాణంలో చికాకులు. దూర ప్రదేశాల నుంచి సమాచారం కొంత ఊరట ఇస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారాన్ని ఆశిస్తారు. దూర ప్రయాణం, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. వ్యాపార విస్తరణ, నూతన వస్తువుల కొనుగోలు ఆలోచనలు చేస్తారు. శ్రమ అధికం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఆర్థిక సంబంధిత విషయాలలో, వాగ్వాదాలలో, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు ఫలిస్తాయి. వైరాగ్యాన్ని అధిగమించాలి. వృత్తిపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ధనరాబడి. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, వ్యాపార వ్యవహారాలు కొంత ఆందోళనను, శాంతిని కలిగిస్తాయి. యోగా, మెడిటేషన్ చేయాలి.

మీన రాశి

మీనరాశి వారు ఆశించిన పనుల్లో విజయం, ఆర్థిక లాభం, ఆగుతూ వస్తున్న అనేక పనులు ముందుకు వెళ్తాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, మిత్రుల సహకారం, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి, శత్రు, రోగ, రుణాల మీద విజయం సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన పనులు జరగడానికి సూచనలు లభిస్తాయి.

అనవసర ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ మీద మీకు నమ్మకం, స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలలో పెట్టుబడులకు ఆలోచనలు, జీవిత భాగస్వామితో నూతన ప్రదేశాలకు వెళ్లడానికి అవకాశాలు ఉంటాయి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More