నేటి రాశి ఫలాలు జూలై 09, 2025: ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ యోగం, బంధుమిత్రుల సహకారం!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 09.07.2025 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 09, 2025 4:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 09.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: ఆషాడ, వారం : బుధవారం, తిథి : శు. చతుర్దశి, నక్షత్రం : మూల

మేష రాశి

మేషరాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గృహంలో మార్పుల వల్ల ఆందోళన చెందుతారు.

వృషభ రాశి

వృషభరాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చే జరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలలో అన్ని విజయవంతమవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మిథున రాశి

ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవుట వల్ల ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. వ్యవసాయరంగానికి లాభదాయకంగా ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటకరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొత్త వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. బుణ ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం రాకుండా జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులను నమ్మరాదు.

సింహ రాశి

సింహరాశి వారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాలలో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఆకస్మిక ధననష్టం అవకాశముంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనైనా నిరుత్సాహం పనికిరాదు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.

కన్య రాశి

కన్య రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయరంగం, క్రీడారంగంలోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటిలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశముంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే అనారోగ్యం ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.

తులా రాశి

తులా రాశి వారి స్థిరాస్తుల సమస్యలు పరిష్కరించబడతాయి. కొత్త గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేస్తారు. భక్తి, శ్రద్ధలు అధికమవుతాయి. పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారుల ద్వారా గౌరవం లభిస్తుంది. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. అనారోగ్యం తొలగిపోతుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి అనుకూల స్థానచలనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పు కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అవుతుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. బుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయి. పొట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్యం అధిగమించుటకు వైద్య సేవ అవసరం. స్థిరాస్తుల విషయంలో తొందరపాటు మంచిది కాదు.

ధనుస్సు రాశి

ధనుస్సురాశి వారు కొత్త కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పాహారం వల్ల అనారోగ్యం పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలు కలుగుతాయి. అనారోగ్యం కలిగిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన కలుగుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.

మకర రాశి

మకరరాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖం పొందుతారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది.

కుంభ రాశి

అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వింటారు. ఆకస్మిక ధననష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. కళారంగం, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహ శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు పొందుతారు. కొత్త వస్త్రాలు, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది.

మీన రాశి

మీనరాశి వారు బంధు, మిత్ర విరోధం రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అనారోగ్యాన్ని అధిగమిస్తారు. అనవసర నిందల వల్ల అపకీర్తి కలుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కొత్త కార్యక్రమాలకు ప్రణాళికలు వేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాలలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. క్రీడారంగం, రాజకీయ రంగాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. స్త్రీలు సంతోషంగా గడుపుతారు. అకాల భోజనాల వల్ల అనారోగ్యం కలుగుతుంది.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More