నేటి రాశి ఫలాలు జూన్ 22, 2025: ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపు ఉంటుంది!

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 22.06.2025 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 22, 2025 4:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

హిందుస్తాన్ టైమ్స్

రాశిఫలాలు (దిన ఫలాలు) : 22 .06.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: జ్యేష్ఠ, వారం : ఆదివారం, తిథి : కృ. ద్వాదశి, నక్షత్రం : భరణి

మేష రాశి:

మేష రాశి వారు బంధు మిత్రులతో ఉత్సాహంగా ఉంటారు. సంతానపరంగా కోరుకున్నవి పూర్తికాగలవు. అనవసర ఖర్చులు పెరగకుండా ఆర్థిక అవసరాల పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా చేయండి. కుటుంబ వ్యవహారాల్లో సంయమనాలు అవసరం. వస్తు కొనుగోళ్లూ, అమ్మకాలు నిరాశలేర్పరచగలవు. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు ఇతరులను ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ప్రయాణాలు ప్రయోజనమిస్తాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్తవైన హోదాలు, అదనపు బాధ్యతలు వంటివి ఏర్పడగలవు. గృహ, కుటుంబ వ్యక్తులకు ఆచరణ, అలంకరణలు ఏర్పరచగలరు. వాహన మార్పులు ప్రధాన భూమిక వహించగలవు. ఆదాయాల్లో మిగులు శాతములుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో మంచి మార్పులేర్పరచగలవు. ప్రయాణ పెట్టుబడులందు జాగ్రత్తలు అవసరం.

మిథున రాశి:

మిథున రాశి వారు అన్ని వ్యవహారాల పట్ల అవగాహనలతో ముందుకు ప్రయత్నించుకుంటారు. ఊహించుకున్నవి సాధించుకోగలరు. బంధు మిత్రుల మధ్య ఆపోహలు తొలగుతాయి. గతంలో దూరమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నతరహా గుర్తింపులు పొందగలరు. అవివాహితులు, నిరుద్యోగులు నిరాశలేర్పరచుకోకుండా సాగాల్సి వుంటుంది.

కర్కాటక రాశి:

మార్పు తప్పనిసరిగా చేసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకుంటూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. ఆహార, విరామ నియమాలు తప్పనిసరిగా పాటించండి. అటూ ఇటూ అయినా తలచిన పనులు పూర్తవుతాయి. ప్రభుత్వతరహా పనులను పూర్తి చేసుకోగలరు. ఆధ్యాత్మికతలతో కూడిన ప్రయాణాలుంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి.

సింహ రాశి:

సింహ రాశివారు కోపావేశాలను అదుపులో ఉంచుకుంటూ వ్యవహరించుకోవాలి. అనారోగ్యం, ఔషధ సేవలు ఏర్పడగలవు. జీవనోపాధి మార్గాలు ఉత్సాహకరంగానే సాగుతాయి. మీ ప్రమేయం లేకుండా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. స్పెక్యులేషన్లకు, అప్పులు ఇచ్చుటకు దూరంగా ఉండండి. వాహన, యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపులు ఏర్పరచుకుంటారు.

కన్యా రాశి:

కన్యా రాశివారు గతంలో ఇబ్బందులకు గురిచేసిన అంశాలు తిరిగి తెరపైకి వస్తాయి. కుటుంబంలో కలసిరాకపోవడం, ఖర్చులు పెరగడం వల్ల మానసిక సంఘర్షణలు చోటుచేసుకుంటాయి. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణతలు కొనసాగుతాయి. భూ, గృహ విషయాల్లో పెట్టుబడులు ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలుంటాయి.

తులా రాశి:

తులా రాశి వారికి గ్రహ సంచారాలు అనుకూలం. ప్రయత్న కార్యాలను వేగవంతం చేసుకోండి. బంధు మిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు ఏర్పడతాయి. నూతన పనులను ప్రారంభించి పూర్తిచేసుకోగలరు. గత ఒడిదుడుకులను పూర్తిగా రూపుమాపుకొని, దైనందిన నిత్యకృత్యాలతో బిజీగా ఉండగలరు. కొన్ని షార్ట్ జర్నీస్ చేయక తప్పకపోవచ్చు. అధికారులతో చర్చల సమయంలో సంయమనం పాటించుకోవాలి.

వృశ్చిక రాశి:

అవసరాలను సమర్థించుకోగలిగినా, ఆర్థిక వ్యవహారాలు నిరాశకు గురిచేయగలవు. ఊహించుకున్న స్నేహ, బంధు వర్గం వారు చిక్కదు దొరకదు తరహాలో ఉంటారు. తోటి ఉద్యోగుల నుండి, భ్రాతృవర్గం నుండి సహాయాలు ఉంటాయి. నూతన వ్యాపార వ్యవహారాల తలంపులకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని ఊహించని ప్రయాణాలు చేయవలసి రావచ్చు.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారు ఆరోగ్య పరంగా చిన్నతరహా జాగ్రత్తలకు ప్రాధాన్యతనిస్తూ ప్రయత్నాలను చేపట్టుకోండి. అవకాశాలను అందిపుచ్చుకోవలసి వుంటుంది. చిన్నతరహా పెట్టుబడుల నుండి ప్రయోజనాలు పొందగలరు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమలున్నా ప్రయోజనాలు, గుర్తింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో సమయానికి తగినట్లుగా మార్పు చేర్పులు చేసుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి సమయం.

మకర రాశి:

మిశ్రమ స్థితులు ఉంటాయి. అష్టమ కుజ, కేతువులు పట్టుదల, పోరాడాలనే భావనలు ఇస్తాయి. ఆలోచనాత్మకంగా ఉండేటట్లు జాగ్రత్తలు అవసరం. పంచమ శుక్రుడు ఆశావహ స్థితులను ఏర్పరచగలడు. బంధు మిత్రులతోను, అధికారులతోను సంప్రదింపులు, మంచి మార్గదర్శకాలు ఉంటాయి. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు మంచి సమయం. అవకాశాలు కలసివస్తాయి.

కుంభ రాశి:

కుంభ రాశికొన్ని పనులను చేపట్టుకుంటారు. కుటుంబ వ్యక్తుల ఆరోగ్యానికి ధనం, సమయ కేటాయింపులు అవసరమవుతాయి. పలుకుబడి గల వ్యక్తుల పరిచయాలు తదితర ప్రయోజనాలుంటాయి. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న ఋణ సమస్యకు విముక్తిని పొందగలుగుతారు. అవసరాలను సమర్థించుకోగలుగుతారు. క్రయవిక్రయాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలకు మిశ్రమ స్థితులుంటాయి.

మీన రాశి:

ఆర్థిక సామాన్యతలు కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహకర స్థితులుంటాయి. ఇంటా–బయటా ప్రోత్సాహమును చూడగలరు. బాధ్యతాయుత ప్రవర్తనకు గుర్తింపులు ఏర్పరచుకోగలరు. తప్పనిసరి ప్రయాణాలు కొన్ని ఉంటాయి. ఆరోగ్య పరంగా మంచి మార్పులు చూడగలరు. బంధు మిత్రుల సహకారాలుంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More